02 మార్చి 2011

మహాశివరాత్రి శుభాకంక్షలు...


ఉదయం 4:30కి లేపి ఇవాళ శివరాత్రి వెళ్ళి చదువుకోపో అని నిద్రలేపిపంపింది ఆష.
నేను లేచి పుస్తకం పట్టుకుని వేరే రూముకెళ్ళి కూర్చున్నా. ఆ పుస్తకంలో నా వ్రాతప్రతి(కాగితం) ఒకటి ఉంటే చదువుతూ కూర్చున్నా. అందులో నేనెప్పుడో రాసిన భగవత్గీత శ్లోకం ఒకటి ఉంటే ఆ మాయలోబడి భగవత్గీత పఠనం మొదలుపెట్టను. ఇంతలో శివుడు వచ్చి "ఇవాళ నాకు ప్రత్యేకమైన రోజు, ఈ ఒక్క రోజైనా నీ వైకుంఠ స్తుతి మరరచి కైలాశాన్ని కొలువరా" అని వెళ్ళిపోయాడు. అప్పటికే 6:30 అయిపోయింది!

తప్పైపోయింది, ఇప్పుడే చదువుతాను అని "తిరుప్పుగళ్" చదవడం మొదలుపెట్టాను. ఓక 10 నిముషాల్లో మళ్ళి శివుడు తిరిగొచ్చి "ఇప్పుడుకూడా నువ్వు నన్ను స్తుతించడం లేదు. మా అబ్బాయినే(సుబ్రమణ్యస్వామి నే)స్తుతించుతున్నావు. తిరువాచకం చదువు" అని గుర్తు చేసివెళ్ళిపోయాడు.

నా మతిమండా అని నన్ను నేను నొచ్చుకున్నాను. అప్పటికే సమయమైపోయింది.
సరేలే కాసేపు మనసులోనే ఓ పాట రూపంలో శివుణ్ణి స్తుతించితే సరిపోతుందిలే అనుకుని కింద లైన్లు పాడుకున్నాను.

అంతకాంత నీ సతి, అగ్నితప్తమైనది!
మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది!
ఆదిశక్తి ఆకృతి, అద్రిజాత పార్వతి!
స్థాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది!
భవుని భువికి తరలించేలా..
తరలి విధిని తలపించేలా రసతరంగిణీ లీల!
యతిని నృత్య రథుని చేయగలిగే ఈవేళ..

....

ఈ సారి కోపంగా తిరిగొచ్చాడు శివుడు, "ఇప్పుడుకూడా నన్ను తలచలేదోయ్ నువ్వు! మా ఆవిడ, శక్తి గొప్పతనంగూర్చి పాడుకుంటున్నావ్. నువ్వు ఇకా మారనే మారవా?" అని కోపంగా తిట్టెళ్ళిపోయాడు ఆ గిరిజానాథుడు.

ఎలా వేగుతున్నావు పార్వతీ, ఈ మనిషితో? నీ సహనానికి జేజేలమ్మా!

"అందరికీ నా శివరాత్రి శుభాకంక్షలు"

PS.  పైనున్న పాట సిరివెన్నెల గారి రచన. పౌర్ణమి చిత్రంలో చిత్ర పాడిన భరత వేద... అన్న పాటలోని మొదటి చరణం!

1 వ్యాఖ్య:

కౌటిల్య చెప్పారు...

బావ్స్! నాదే ఫస్ట్ కామెంట్...ః)...

ఇంతకీ అంత పొద్దున లేచి ఏం చదువుతున్నావబ్బా!

అయినా నీకు మొదట తెలుగువేవీ గుర్తురాలేదా! దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా...ః)