21 మార్చి 2011

మువ్వలె మనసుపడు పాదమా?

భాషేదైనా, కాలమెపుడైనా కవులు ఎక్కువగా వర్ణించింది ప్రకృతినీ, అమ్మాయిలనే! ప్రతి దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఆ యా raceకి తగ్గ grace ఉంది అమ్మాయిలకి. అందుకే వాళ్ళ race అమ్మాయిలంటే అంత craze అబ్బాయిలకి...

అలాగే మన తెలుగు raceలో కూడా అమ్మాయిలకి uniqueకయిన ఒక grace ఉంది. వోణీ వేసుకుని వరిచేల గనిమల మీద అల్లరిచేస్తున్నా, పట్టు చీరలో వయ్యారంగా గుడికొచ్చినా, ప్యాంట్-షర్ట్ తొడిగినా, మౌస్ పట్టుకుని మృదువైన వేళ్ళతో కీబోర్డ్ నొక్కినా, జెడ అల్లి కుప్పెలుపెట్టుకున్నా, అల్లక వదులుకున్న కురులను అప్పుడప్పుడు అలా చిటుకెనవేలితో నాజూకుతో చెవులవెనక్కి సవరించుకున్నా, చిన్నపిల్లలతో కలిసి పాడుకుంటున్నా ఇట్టే గుర్తుబట్టేయచ్చు పదహారణాల తెలుగమ్మాయిని. కాలంతోబాటు చేసే పనులు, వేసే దుస్తులు మారాయిగాని తెలుగుదనం అలానే ఉంది :-)

ఈ పదహారణాల తెలుగు అమ్మాయిలమీద రాయబడిన సినిమా పాటల్లో నాకు ఇష్టమైనవి
"తేట తేట తెలుగులా, తల్లవారి వెలుగులా, తేరులా, సెలయేరులా, కళకళా, గలగలా కదలి వచ్చింది కన్నె అప్సర..." ఆత్రేయ వర్ణించిన పాట,

"పూసింది పూసింది పున్నాగ..." వేటూరి లిఖించిన పాట

"చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా..." సిరివెన్నెల రాసిన పాట

 ================================
ఉష గారు అద్భుతంగా గానం చేసిన ఈ పాటను వినేందుకు...

( పాడేముందు తేనే సీసా మింగేశారేమో :-))
================================


చిత్రం : నీ స్నేహం
గళం : ఉష
సంగీతం : R P పట్నాయక్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
 పల్లవి
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా?
మువ్వలె మనసుపడు పాదమా?
ఊహలే ఉలికిపడు ప్రాయమా?
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ!

ఆమని మధువనమా? ఆమని మధువనమా?

అప్పుడే పడిన చినుకులకి విచ్చుకున్న పువ్వట ఆ అమ్మాయి. అందమైన చిలిపికలకు రూపం నువ్వు. నీ పాదాలెంత అందమంటే మువ్వలే నీ పాదాలతో మనసుపడతాయి. ఊహలు ఉలికిపడే ప్రాయం నీది. హిందోళంలో పాడుతూ సాగే సెలయేరు నువ్వు.

చరణం 1
పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ!
పచ్చనైన వరిచేల సంపదలు; అచ్చ తెలుగు మురిపాల సంగతులు
కళ్ళ ముందు నిలిపావే ముద్దుగుమ్మా!
పాల కడలి కెరటాల వంటి నీ లేత అడుగు
తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా!
ఆగని సంబరమా!

పసిడివేకువనీ, పండువెన్నెలనీ, పసితనాలనీ, పరువాల వెల్లువల్ని కలిపి చేశాడు ఆ బ్రహ్మ నిన్ను. అందుకేనేమో పచ్చనైన వరిచేల అందమూ, అచ్చ తెలుగు మురిపాలూ నీ రూపంలో నడుస్తుంది. పాల సముద్రంలో వచ్చే తెల్లటి అలలాంటి నీ మెత్తని పాదం నేలవాలినపుడు ఆ భూదేవి ఎదను వీణలా మీటి పులకింపచేసింది.

(సిరివెన్నెల గారూ, మీరు పాదం మోపిన ప్రతిసారీ ఆ భూదేవి గర్వంతో పులకిస్తూ ఉంటుందండి!)
చరణం 2

వరములన్ని నిను వెంటపెట్టుకుని
ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతున్నవే కుందనాల బొమ్మ!
సిరుల రాణి నీ చేయి పట్టి
శ్రీహరిగ మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచియున్నదమ్మా?
అన్నమయ్య శృంగార కీర్తనల
వర్ణనలకు ఆకారమైన
బంగారు చిలకవమ్మా!
రాముని సుమశరమా...

ఓ కుందనాల బొమ్మా! మహా తపస్సులుచేస్తేగాని దొరకని ఎన్నో గొప్ప వరాలాన్ని కట్టకట్టుకుని వచ్చి నువ్వు ఎలా చెప్తే అలా  చేస్తాం అని సిద్దంగా  నీ ఆనతికోసం ఎదురుచూస్తున్నాయి.

అదేకాదు, నువ్వు సాక్షాత్తు ఆ శ్రీదేవి అవతారం! నువ్వు కాదు విష్ణుని వరించేది. ఎవడైతే నిన్ను వరిస్తాడో వాడే శ్రీహరిగా పిలవబడతాడు. అలా శ్రీహరిగా పిలవబడాలని రాసిపెట్టి ఎవరి జాతకం వేచియుందో మరి!

నువ్వేగా మహాలక్ష్మి? ఆ అన్నమయ్య రాసిన వేలాది కీర్తనలలో వర్ణింపబడినదికూడా నువ్వే. చెడుని హతమార్చే తిరుగులేని రామబాణం కూడా నువ్వే!

========================================================
Movie : nee snEham
singer : usha
Music : R P Patnaik
Lyrics : Sirivennela Seetarama Sastri
pallavi

chinuku taDiki chiguru toDugu puvvammaa
evari kanula chilipi kalavu nuvvammaa?
muvvale manasupaDu paadamaa?
oohalE ulikipaDu praayamaa?
hiMdOLaMlaa saagE aMdaala selayEramma!
aamani madhuvanamaa? aamani madhuvanamaa?


charaNaM 1

pasiDi vEkuvalu paMDu vennelalu
pasitanaalu paruvaala velluvalu
kalipi ninnu malichaaDO EmO brahma

pachchanaina varichEla saMpadalu;
achcha telugu muripaala saMgatulu
kaLLa muMdu nilipaavE muddugummaa

paala kaDali keraTaala vaMTi
nee lEta aDugu tana edanu meeTi
nElamma poMgenammaa

aagani saMbaramaa!


charaNaM 2

varamulanni ninu veMTapeTTukuni
evari iMTa deepaalu peTTamani
aDugutunnavE kuMdanaala bomma!

sirula raaNi nee chEyi paTTi
Sreehariga maarunani raasipeTTi
E varuni jaatakaM vEchiyunnadammaa?

annamayya SRMgaara keertanala
varNanalaku aakaaramaina
baMgaaru chilakavammaa!

raamuni sumaSaramaa...
========================================================