25 సెప్టెంబర్ 2011

ఆంధ్ర రాష్ట్ర విభజన : అవినేని భాస్కర్ - "అరవ" భాస్కరన్ అయిన కథ...

మనదేశ స్వాతంత్రానికి ముందువరకు చిత్తూర్ జిల్లాకీ, నెల్లూర్ జిల్లాకీ దక్షిణంగా ఆనుకునియున్న తమిళనాడు జిల్లాల్లో తెలుగువారి సంఖ్యే ఎక్కువగా ఉండేదిట. మదరాసు ప్రెసిడెంసిగా ఉన్నప్పుడుకూడా అదే పరిస్థితిట. కొన్ని అనివార్య కారణాలవలన, ఉన్నతమైన ఉద్ధేశంతో, ఉత్తమ నాయకులు కొందరు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుకున్నారు. జిల్లాలో ఎక్కువగా తెలుగువారుంటే ఆ జిల్లాని ఆంధ్ర రాష్ట్రంలోనూ, తమిళులుంటే తమిళనాడులోనూ కలిపేశారు. అప్పట్లో మదరాసు పట్టణము, ధర్మపురి, ఆర్కాడు, చెంగల్పట్టు జిల్లాల్లో ఎక్కువగా తెలుగువారే ఉన్నప్పటికీ కొందరు తమిళ నాయకులు తమ రాజకీయ లబ్ధికోసం కొన్ని ఎత్తుగడలేసి ఈ జిల్లాలను తమిళనాడులో కలిపేశారట. 


ధర్మపురి & కృష్ణగిరి జిల్లాలు :

ఇది అప్పటి కాంగ్రస్ నాయకులు రాజాజీ అనబడే రాజగోపాలాచారి గారి సొంత జిల్లా! ఆయన అప్పటికే తమిళుల మధ్య పలుకుబడిగల నాయకుడు. తన సోంత ఊరూ, జిల్లా ఆంధ్రాలో కలిసిపోతే ఇటు తమిళనాడు రాజకీయాల్లోనూలేక, అటు ఆంధ్ర రాజకీయాల్లోకీ వెళ్ళలేక అయోమయం అవుతాడుగనుక తమ జిల్లాను తమిళులు ఎక్కువవున్న జిల్లాగా ప్రకటించి తమిళనాదులోకి కలిపేశారు. ఇప్పటికీ ఇక్కద గ్రామాలపేర్లు తీసుకుంటే తమిళ, కన్నడ పేర్లకన్నా తెలుగు పేర్లే ఎక్కువ. 


చెంగల్పట్టు (ఇప్పుడు తిరువళ్ళూర్ & కాంజిపురం) జిల్లా :

అప్పటి మదరాసు ప్రెసిడెంసీ రాజధాని మదరాసే. ఈ మదరాసు(చెన్నై) చెంగల్పట్టు జిల్లా మధ్యభాగాంలో ఉంది. చెంగల్పట్టు జిల్లాని తెలుగు జిల్లాగా గుర్తిస్తే ఇక మదరాసుపట్టణం కూడా ఆంధ్రాకే ఇవ్వాలికదా? మదరాసుని కోలిపోడానికి ఇష్టంలేని నాయకులు చెంగల్పట్టు జిల్లాని తమిళజిల్లాగా కల్పించారు. 


ఆర్కాడు జిల్లా (ఇప్పుడు వేలూర్ జిల్లా) :

పడమటిదిశలోని ధర్మపురినీ, తూర్పుగాయున్న చెంగల్పట్నీతమిళనాడులోకి కలిపేశాక మధ్యలో ఉన్న ఆర్కాడుని ఆంధ్రాలోకి కలిపితే ధర్మపురి జిల్లాకి దారెలా? అందుకని ఈ జిల్లా పొలిమేరలుకూడా తమిళంతోనే గీసేశారు. ఈనాటికీ  జ్యోతిష్యులు చాలావరకు వాడేది ఆర్కాడు తెలుగు పంచాంగాలే. 

మిగిలిన తమిళనాడు జిల్లాల్లోకూడా తెలుగువారున్నారు. సంఖ్య తక్కువ అంతే. 
అధికారభాష

మొదట్లో ఈ ప్రాంతాలలో ఎక్కువగా తెలుగు బళ్ళుండేవి. బళ్ళుంటే చాలా? బల్లలమీదకూడా తెలుగే ఉండాలికదా? ఈ ప్రాంతాల్లో  అధికార భాష తమిళం గనుక ప్రతిచోటా తమిళంలోనే రాయబడ్డాయి. ఇది కొంతవరకు యుక్తిపూర్వకంగానే చేశారు. ఉద్యోగాలకోసమనో, మరికొన్నిసౌకర్యాలకోసమనో తమపిల్లల్ని తమిళం చదివించక తప్పలేదు ఈ ప్రాంతంలోని తల్లి తండ్రులకి. అక్కడితో ఆగలేదు - ఉద్యోగాలివ్వడంలోకూడా తెలుగుపేర్లున్నవారిని వెనక్కిపెట్టేవారట. తమ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యకర్తలు అందరూ తమిళులే ఉంటే ఇక ఇక్కడ తెలుగువారికి తమిళం నేర్చుకోడం తప్పనిసరైయింది. తెలుగుబళ్ళకు పిల్లలులేక క్రమేనా మూతబడుతున్నాయి తెలుగు స్కూల్లు. అందులోని ఉపాద్యాయులుకూడా ఉద్యోగం అవసరంగనుక 10వ తరగతి తమిళ పేపర్ పరిక్షరాసి తమిళ స్కూల్లలో పనిచెయ్యడానికి వెళ్ళిపోయారు. మా బంధువుల్లో ఎందరో ఉపాద్యాయులు ఇలా చేశారు పాపం.

ఇక్కడ బడిపంతులు మొదలుకొని, విలేజ్ ఆఫీసర్ వరకు తమిళులే. వీరికి అనధికారంగా ఏమైనా ఉత్తరవులిచ్చారో ఏమో మరి. వీలైనంతవరకు ఇక్కడవాళ్ళను తమిళవారుగా చేసిపడేశారు. ఎలా?


ఊర్ల పేర్లు :

ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఊరిపేర్లలో జాతిపేర్లుండేటివి. జాతిపేర్లను తొలగిస్తాం అంటూ వాటిని తమిళ ఊర్లుగా మార్చేశారు...
నరసింహరాజు పేట --> నరసిమ్మన్ పేట్టై
మునసామి నాయుడు కండిగ --> మునసామి కండిగై
బుచ్చిరెడ్డి పల్లె --> పుచ్చిపల్లి
గొర్రెదాటుబెట్ట --> కేత్తాండన్ పట్టి
గొల్లకుప్పం --> కొళ్ళిక్కుప్పం
కావేరిరాజులుపేట --> కావేరికారిపేట్టై
సూరరాజపట్టెడ --> సూరాజిపట్టడై
ఇలా చాలా తెలుగుళ్ళుకు తమిళులు నామాలేశారు!


వ్యక్తుల పేర్లు :

జనాబ సంఖ్యలెక్కరాసే అధికారీ, రేషన్ కార్డిచ్చేవాడూ, ఎలక్టోరల్ అధికారీ వీరందరూ కూడా ఇలా రాసేసేవారు...
సుందరమ్మ --> సుందరామ్బాళ్
దేవకమ్మ --> దేవగి అమ్మాళ్
చిన్నబ్బ --> చిన్నప్పన్
కుప్పయ్య --> కుప్పన్ / కుప్పయ్యన్
శ్రీనివాస్ --> శ్రీనివాసన్
కేశవులు --> కేసవన్
రామకృష్ణ --> రామకిరుష్ణన్
జ్యోతి --> జోది
రాఘవులు --> రాగవన్
రాహుల్ --> రాగుల్

రేషన్ కార్డులోనో, వోటర్ కార్డులోనో అచ్చయి వచ్చాక చూసుకుని బాధపడేవారు ఉన్నారు, అసలు వాటిగురించి అసలు ఆలొచించని వారూ ఉన్నారు. మార్చుకోవాలని ఆశవున్నా ఆ గవర్నమెంటు ఆఫీసులు చుట్టు తిరిగాలన్న భయంతో ఇప్పుడు పేరిలా ఉంటే వచ్చే నష్టం ఏముందిలే అని సర్దుకునేవారూ ఉన్నారు.

ఇలా తమిళనాట ఎందరో తెలుగువారు తమ ఐడెంటిటీని కోలిపోయారు. 

ఇది కేవలం ఐడెంటిటి కోలిపోవడంమాత్రమే కాదు, తెలుగుతనానికి దూరమవ్వడం, తెలుగు సాంప్రదాయాలు తెలియకపోవడం, భాష మరిచిపోవడం వంటి పెద్ద నష్టాలూకూడా జరిగిపోయాయి. ఎందరో తెలుగువారి ఇళ్ళల్లో పాతికేళ్ళలోపున్నవారు తెలుగు మాట్లాడ్టంలేదు. తెలుగు నాలుకలమీద తమిళ సరస్వతి సింహాసనమేసుకుంది. వారి మాతృభాష తమిళమే అన్న పరిస్థితి తయారైంది.

=================================================

తెలుగుభాషాభిమానంగల కుటుంబంలోపుట్టిన నాపేరుకూడా ఇలానే చెలామని అవుతుందంటే ఆ తమిళీకరించే తీవ్రత ఎంతగా ఉంటుందో ఆలోచించండి. 

1989 వరకు బర్త్ సర్టిఫికేట్ కంపల్సరి కాదు మనదేశంలో. పదో తరగతి మార్కు షీట్లో ఏముందో అదే పేరు. నేను అంతకుముందే పుట్టానుగనుక నా పదవతరగతి నార్కుషీటులో ఓ తమిళుడు నా పేరుకు అరవరంగేసేశాడు.  ఇంట్లో నాకు భాస్కర్ అని పేరుపెట్టారు. బళ్ళో రాయగా "A BHASKAR" అని రాశారు. పదవ తరగతి పరీక్షలకు మునుపు ఫార్మఫిల్ చెయ్యాలి...

Name : BHASKAR
Initials : A

నేనిలా రాసిస్తే, చివరికి మార్కుషీట్లో "BHASKARAN N" అని వచ్చింది. తమిళులకి ఇంటిపేరుండదు, పేరుకు చివర తమ తండ్రిపేరు మొదటి అక్షరాన్ని అంటించుకుంటారు. నాకూ అలానే మా నాన్న పేర్లోని 'N' తీసి అంటించేశారు. నా రిజిస్టర్ నెంబర్, మార్కులు అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి.  ఏజుకేషన్ డిపార్త్మెంట్ లోని వెర్రి క్లెర్కు చూపిన తమిళ అభిమానాన్ని చూసి నేను గోలుగోలుమని ఏడ్చాను! పేరు మార్చడానికి అప్లై చేస్తే రాడానికి 3 నెలలవుతుందన్నారు. పైన చదవాలంటే మార్కుషీటు కావాలి కదా? అంతవరకు ఎలా ఆగడం? తెలిసిన ఒక మాస్టారుని సలహా అడిగితే,

"ఉండిపోనీలేవయ్యా, ఇలా ఉంటే ప్రభుత్వ ఉద్యొగాలకు అప్లై చేసినప్పుడు పక్కనపెట్టరు" అని సెలవిచ్చారు.

 ఇలా ఎందరో తెలుగువారు తమిళులుగా చెలామనియవుతున్నారు!

24 వ్యాఖ్యలు:

మందాకిని చెప్పారు...

ఈ అక్రమం ఇప్పుడు కూడా బదిలీ మీద వచ్చినవాళ్ళకి కూలివాళ్ళకి జరుగుతూ ఉన్నదే. మీరన్నట్టు ఆఫీసుల చుట్టూ తిరగలేక రాజీ పడేవాళ్ళెందరో!
న్ లేకుండా పేరుండదని ఎందుకనుకుంటారో!

వనజ వనమాలి చెప్పారు...

chaalaa baadhaakaram.:-)))))))

Indian Minerva చెప్పారు...

మరీ మద్రాసునెలా ఆంధ్రులకిచ్చేస్తామనుకున్నారో మనవాళ్ళారోజుల్లో. చుట్టూ తమిళనాడూ మధ్యలో ఆంధ్రనా? హవ్వ హెంతవమానంగా వుండేది తమిళులకి :).

తమిళులకి సంబంధించినంతవరకూ నాకొకటి అర్ధంకాదు. ఎవరికైనా మనభాష నచ్చితే వాళ్ళు ప్రేమించి సేవచేస్తారేగానీ (బ్రౌనులాగా) ఇలా నేర్చుకుంటావా ఛస్తావా అంటే ఎలా ప్రేమించగలుగుతారో నాకర్ధంకాదు. ఐతే ప్రస్తుతానికి అంత ఛాదస్తంగా వాళ్ళుకూడా లేరనుకుంటాను. మూడేళ్ళక్రితం చెన్నై వెళ్ళినప్పుడు ఇలాగే భయపడుతూ వెళ్ళాను కొంచెం తమిళడైలాగులు రిహార్సలుచేసుకొనిమరీ. కానీ ఆడైలాగులు అవసరంలేకుండానే తెలుగు, ఇంగ్లీషులతో నెట్టుకొచ్చాను. ఇంకోమాట చెన్నైలో ప్రతిముగ్గురిలో ఒకరు తెలుగుమాట్లాడేవాళ్ళేనట ఈనాడువారు పరిశోధించి చెప్పారు అప్పుడెప్పుడో.

ఈ బాషాఛాదస్తం కన్నడవాళ్ళక్కూడా ఎక్కువే. కన్నడ తాయికి నవంబరు ఒకటిన కొబ్బరికాయకొట్టడం చూసి ఒకసారి హాశ్చర్యపోయాను. రెండుమూడు సార్లు స్పీచిచ్చిన దురభిమానులకు కొంచెం harsh రియాక్షన్సిచ్చి నోర్మూయించాల్సొచ్చింది. ఇహ మనదగ్గరికొస్తే మనకు అంత ఎక్కువగా ఉండక్కర్లేదుగానీ అసలుకంటూ ఉండాలి. కనీసం తెలుగులో మాట్లాడితే అదేదో తక్కువపనిచేసినట్లుగా చూడ్డం మాత్రం మానెయ్యాలి. ఇద్దరి తెలుహువాళ్ళ పరిచయవాక్యాలు ఇంగ్లీషులోనే సాగుతాయనేలా వుండకూడదు.

Indian Minerva చెప్పారు...

అన్నట్టు నీ అధికారిక నామం భాస్కరన్నా(భాస్కరన్+నా) భాస్కరన్నా (భాస్కరు + అన్న)? ఇంగప్పారు!!

Praveen Sarma / प्रवीण् शर्मा చెప్పారు...

తమిళులలో కొంత మందికి ఇంటి పేర్లు ఉంటాయి. కొందరికి ఈరోడు, కంజీవరం లాంటి ఊర్ల పేర్లు ఇంటి పేర్లుగా ఉన్నాయి. నల్లాన్ చక్రవర్తి (beloved king) అనే ఇంటి పేరు కూడా తమిళులలో కనిపిస్తుంది.

అజ్ఞాత చెప్పారు...

ఇప్పుడు birth certificate లోనే పేరు పెడ్తున్నారు కదా? ఇప్పడు కూడా జరుగుతుందా ఇది ?

Mauli చెప్పారు...

very sad :(

Sravan Kumar DVN చెప్పారు...

ఐకమత్యం, ఆత్మ గౌరవం లేని జాతికి అస్థిత్వం ఉండదు.

అప్పట్లో ఆంద్ర రాష్త్రం వేరు పడుతున్నప్పుడు , దక్షిణ తెలుగు ప్రజలు (అనగా ప్రస్తుతం తమిళనాడు లోని అప్పటి తెలుగు ప్రాంతాల ప్రజలు) చాలా బాధ పడ్డారని(మనవాళ్ళు విడిపోతున్నారనే బాధ) విన్నాను/చదివాను.

బళ్ళారి , హోసూరు లాంటి ప్రాంతాలనయినా ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఉండాల్సింది. కోయంబత్తూరు లో కూడా మ స్నేహితులు తెలుగు వాళ్ళు ఉన్నారు.

50యేళ్ళ తర్వాత చరిత్ర పునరావృతమయ్యేట్టుండి.
తెలంగాణా విడిపోతే , అటు చెన్నపట్నాన్ని, సారూప్యత ఎక్కువ ఉన్న వాళ్ళని 50 యేళ్ళ క్రితం పోగొట్టుకొని,
ఇప్పుడు మనందరిదే కదా అనుకున్న హైదరాబాదుని కూడా వదులుకోవాల్సి రావటం దురదృష్టం.

పూసల దండ లో తాడు తెగితే పూసలు చెల్ల చెదురైనట్టుగా , భాష దండ లో తాడు లాంటిది. దాన్ని గౌరవించనప్పుడు, మనమంతా ఒకటి అనే భావన పోతుంది. తమలో తామే గొడవలు పడే వాళ్ళని వేరే వాళ్ళు గౌరవించరు.

ప్రాంతీయ భాషలు గౌరవించబడకపోతే , భారత దేశం ఎన్ని ముక్కలయినా ఆశ్యర్యపోవనవసరంలేదు.

Sravan Kumar DVN చెప్పారు...

ఐకమత్యం, ఆత్మ గౌరవం లేని జాతికి అస్థిత్వం ఉండదు.

అప్పట్లో ఆంద్ర రాష్త్రం వేరు పడుతున్నప్పుడు , దక్షిణ తెలుగు ప్రజలు (అనగా ప్రస్తుతం తమిళనాడు లోని అప్పటి తెలుగు ప్రాంతాల ప్రజలు) చాలా బాధ పడ్డారని(మనవాళ్ళు విడిపోతున్నారనే బాధ) విన్నాను/చదివాను.

బళ్ళారి , హోసూరు లాంటి ప్రాంతాలనయినా ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఉండాల్సింది. కోయంబత్తూరు లో కూడా మ స్నేహితులు తెలుగు వాళ్ళు ఉన్నారు.

50యేళ్ళ తర్వాత చరిత్ర పునరావృతమయ్యేట్టుండి.
తెలంగాణా విడిపోతే , అటు చెన్నపట్నాన్ని, సారూప్యత ఎక్కువ ఉన్న వాళ్ళని 50 యేళ్ళ క్రితం పోగొట్టుకొని,
ఇప్పుడు మనందరిదే కదా అనుకున్న హైదరాబాదుని కూడా వదులుకోవాల్సి రావటం దురదృష్టం.

పూసల దండ లో తాడు తెగితే పూసలు చెల్ల చెదురైనట్టుగా , భాష దండ లో తాడు లాంటిది. దాన్ని గౌరవించనప్పుడు, మనమంతా ఒకటి అనే భావన పోతుంది. తమలో తామే గొడవలు పడే వాళ్ళని వేరే వాళ్ళు గౌరవించరు.

ప్రాంతీయ భాషలు గౌరవించబడకపోతే , భారత దేశం ఎన్ని ముక్కలయినా ఆశ్యర్యపోవనవసరంలేదు.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

@ మందాకిని గారూ,
నిజమేనండీ బదిలీమీద వచ్చినవారూ, కూలినాళ్ళూ ఈ అక్రమాలకు బలైపోయారు ఒకప్పుడు. ఇప్పుడిప్పుడు కొంత పర్లేదండీ.

@ వనజ గారూ,
బాధాకరమే - ప్రతిసారీ నా పేరు చూసుకున్నపుడు!

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

ఇండియన్ మినెర్వా,

ఒకప్పటి మదరాస్లో తమిళులకన్నా తెలుగువారే ఎక్కువుండేవారు. రాష్ట్ర విభజన తర్వాత క్రమేనా తగ్గిపోయారు. ఇప్పటికి ప్రతి నలుగుర్లోనూ ఒక తెలుగువారుంటారు. పలకరిస్తేగానీ వీరు తెలుగువారన్నది తెలియదు.

తమిళుల్ని చూసి కన్నడిగులుకూడా నేర్చేసుకున్నారు ఈ ఛాదస్తాన్ని :(

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

@ప్రవీణ్ శర్మ గారూ,
అవునండి! తమిళుల్లోకూడా కొంతమందికి ఇంటిపేర్లు ఉన్నాయి - బ్రాహ్మణలకూ, ఇంకో ఒకట్రెండు కులాలకూ మాత్రమే ఉన్నాయ్! ఊరిపేర్లుకూడా కోందరు పెట్టుకుంటారు ముందుగా. ఎందుకంటే ఒకే పేరు ఇనిషియల్ తో ఇద్దరున్నప్పుడు ఒకరు తమ ఊరి పేర్ని కలుపుకునేవారు. అలా కోందరికి ఇంటిపేరైపోయింది.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

అజ్ఞాత గారూ,
ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ లు వచ్చాక ఈ ఇబ్బంది కొంత తగ్గింది. పెద్దవాళ్ళు దగ్గరుండి రాయించుకుని వస్తారు. ఏమైనా తప్పు రాసినా వెంటనే దిద్దించుకుంటున్నారు.

మా అన్నయ్య పిల్లలిద్దరికీ దగ్గరుండి ఇంటిపేరుతో సహా రాయించుకున్నాము.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

శ్రావణ్,
____ఐకమత్యం, ఆత్మ గౌరవం లేని జాతికి అస్థిత్వం ఉండదు.___

వాస్తవం చెప్పావు. ఈ తెలంగానా విడిపోతే ఓ 50 యేళ్ళ తర్వాత మన తెలుగు సంస్కృతుకి ఎన్నెన్ని నష్టాలు వస్తాయో, ఏమేమి కోల్పోతామో ఇలా...

MURALI చెప్పారు...

అయ్యో అన్నయ్య. మన పేరుని మనం కోల్పోవటం మాత్రం దారుణం. :(

ఆ.సౌమ్య చెప్పారు...

హ్మ్ మీ పేరు భాస్కర్. ఎన్ అయిన విధంబు కడు విచారకరం. కానీ నాకో డౌటు. రాష్ట్ర విభజన జరిగాక భాష విషయంలో ఇంత దౌర్జన్యము జరుగుతున్నప్పుడు ఆ రాష్ట్రం వదిలి ఆంధ్ర రాష్ట్రమునకు ఎందుకు తరలి రాలేదో?

కోయింబత్తుర్ లో కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారని విన్నను. కానీ వాళ్ళు మాట్లడే తెలుగు చాలా విచిత్రం గా ఉంటుంది. అది తెలుగూ కాదు, తమిళమూ కాదు. ఏదోకొత్త భాష!

Sravan Kumar DVN చెప్పారు...

" రాష్ట్ర విభజన జరిగాక భాష విషయంలో ఇంత దౌర్జన్యము జరుగుతున్నప్పుడు ఆ రాష్ట్రం వదిలి ఆంధ్ర రాష్ట్రమునకు ఎందుకు తరలి రాలేదో?"

తరతరాల నుంచి ఉన్న ఊరిని , నేల ని వదులుకొని ఎవరు వెళ్ళాలనుకుంటారు , అదీ భాష కోసం , అదీ తెలుగు వారు

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

___అన్నట్టు నీ అధికారిక నామం భాస్కరన్నా(భాస్కరన్+నా) భాస్కరన్నా (భాస్కరు + అన్న)? ఇంగప్పారు!!__

ఇండియన్ మినెర్వా, నీకెలా అనిపిస్తే అలా...

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

___ఆ రాష్ట్రం వదిలి ఆంధ్ర రాష్ట్రమునకు ఎందుకు తరలి రాలేదో?___
అది సొల్యూషన్ కాదు కదా, సౌమ్య గారు! మీరిప్పుడు డిల్లోలో స్థిరపడ్డారనుకుందాం. ఓ రెండు తరాల తరువాయి మీ మనుమలు అంత సులువుగా ఆంధ్ర రాష్ట్రానికి రాగలరా?

కోయింబత్తుర్లోనే కాదు, మధురై, కోవిల్పట్టి, తేని, తంజావూర్లో కూడా చాలమంది తెలుగువారున్నారు. వారి భాష ఎటూకాకుండ పోడానికి కారణం అక్కడి వాతావరనం!!!!

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

శ్రావణ్ చెప్పిన పూసల దండ వెనుక ఉన్న ఆపదను గ్రహించాలి నాయకులు!

Sravan Kumar DVN చెప్పారు...

yes, my main worry is , there is no point to keep the rest of the andhra pradesh united if telangana gets seperated.

you need a strong leader for that, right now i dont see any such persons in politics.
otherwise , they ll quarrel for capital and break into 2,3 pieces.

kiran చెప్పారు...

హహహ్హ...పాపం భాస్కర్ గారు :D

కొత్త పాళీ చెప్పారు...

పేరులోనేమి పెన్నిధి యున్నది యని అన్న గిరీశం నుడివినాడూ అలనాడు
పేరులో నొక్క యెన్నున్న (n ఉన్న) యేమాయె అనుకోండి భాస్కరన్ గారూ!

అజ్ఞాత చెప్పారు...

kottapali,
Alaa anukumte mari mee perulomchi Iyer emduku teesesro!