24 డిసెంబర్ 2010

నా కన్నుల్లో కలలన్నీ నీ వల్లో చిక్కాలా

---------------------------------------------------------
 ప్రేమలో ఉన్నవారికి ఈ లోకమంతా అందంగా కనపడుతుందంటారు. నాకు మాత్రం ఇప్పుడిప్పుడే ప్రేమలో ఎదుగుతున్న(పడుతున్న??) అబ్బాయిల్నీ, అమ్మాయిల్నీ, వాళ్ళ అవస్తల్నీ, చేష్టల్నీ, భావాలనీ, Confusionsనీ చూస్తే భలే ముచ్చటగా అనిపిస్తుంది. ఇక్కడ ఓ తెలుగమ్మాయి తన tender feelingsని ఎలా పాడుకుంటుందో చూడండి!
---------------------------------------------------------


వద్దని బుద్ధెంత చెప్పినా ఈ మనసు వినదేంటి? ఏంటి ఈ పిచ్చి? అయినా హాయిగా ఎంత బాగుందో అతని తలుచుకుంటూ ఉండడం. తనతో ఉన్నట్టు ఆలోచించడం. మనసేమో లాగుతుంది బుద్ధేమో ఆపుతుంది. సరే పోనీలే! ఎంత ఇష్టమైనా నేనే వెళ్ళిచెప్తే చులకనైపోనూ? "నేను వేరేవాళ్ళముందు చులకన కాకూడదు కానీ, నాకు తనకు మధ్య ఈ చులకనలూ, Egoలు ఎందుకు? ఏ inhibitions లేకుండా నేను నేనుగా  ఉండగలిగేది తనతో ఉన్నప్పుడు మాత్రమే" అలాంటప్పుడు ఎందుకు ఆపుకోవాలి చెప్పేస్తే పోలే!


రచన : సిరివెన్నెల
గళం : చిత్ర గారు
చిత్రం : కుదిరితే కప్పు కాఫీ
సంగీతం : యోగీశ్వర్ శర్మ
 
పల్లవి
అందర్లాగా నేనూ అంతే అనుకోవాలా
తొందర పెట్టే తోవల వెంటే వెళిపోవాలా
అనుకోనిదైనా ఆలోచన, బాగుంది అననా ఈ భావన!
నిన్నడగాలనుకుంటున్నా, నిందించాలా? ఆనందించాలా?

చరణం 
నో నో అటు పోవద్దు మనసా ఏంటా మత్తు?
అన్నా ముందే ఎన్నో చెప్పి
ఏదో సరదా లెద్దూ వేరే ఏమీ లేదు
తప్పా అంది కట్టు తప్పి
వీలైతే కాసిని కబుర్లు, కుదిరితే కప్పు కాఫీ
అంటూనే చేజారింది ఇట్టే కన్ను కప్పి
మాట మాట కలిపి అటు పైన మాయగొలపి
ఎంత హాయి అంది ఈ తీయనైన నొప్పి
నిన్నడగాలనుకుంటున్నా, నిందించాలా ఆనందించాలా?

చరణం
తానే నమ్మేటట్టు తనపై తానే ఒట్టు
వేస్తూ అందించింది హామీ
పోన్లే పాపం అంటూ త్వరగా వచ్చెయ్యంటూ
చూస్తూ పంపించాను మదిని
గూడంతా ఖాళీ చేస్తూ వెళ్ళిపోయిన గువ్వల్లా
నా కన్నుల్లో కలలన్నీ నీ వల్లో చిక్కాలా
ఎవరి నేరమంటూ నిష్టూరమెందుకంటే
కలిసి ఒప్పుకుంటే అది కూడా మంచిమాటే
నిన్నడగాలనుకుంటున్నా, నిందించాలా? ఆనందించాలా?

===========================================

rachana : sirivennela
gaLaM : chitra
chitraM : kudiritE kappu coffee
sangeetaM : yOgeeSwar Sarma


pallavi
aMdarlaagaa nEnU aMtE anukOvaalaa
toMdara peTTE tOvala veMTE veLipOvaalaa
anukOnidainaa aalOchana, baaguMdi ananA ee bhaavana!
ninnaDagaalanukuMTunnaa, niMdiMchaalaa? aanaMdiMchaalaa?

charaNaM
nO nO aTu pOvaddu manasaa EMTaa mattu?
annaa muMdE ennO cheppi
EdO saradaa leddU vErE Emee lEdu
tappaa aMdi kaTTu tappi!
veelaitE kaasini kaburlu, kudiritE kappu kaaphee
aMTUnE chEjaariMdi iTTE kannu kappi
maaTa maaTa kalipi aTu paina maayagolapi
eMta haayi aMdi ee teeyanaina noppi
ninnaDagaalanukuMTunnaa, niMdiMchaalaa aanaMdiMchaalaa?

charaNaM
taanE nammETaTTu tanapai taanE oTTu
vEstU aMdiMchiMdi haamee
pOnlE paapaM aMTU twaragaa vachcheyyaMTU
chUstU paMpiMchaanu madini
gUDaMtaa khaaLee chEstU veLLipOyina guvvallaa
naa kannullO kalalannee nee vallO chikkaalaa
evari nEramaMTU nishTUrameMdukaMTE
kalisi oppukuMTE adi kUDaa maMchimaaTE
ninnaDagaalanukuMTunnaa, niMdiMchaalaa? aanaMdiMchaalaa?

===========================================