19 ఏప్రిల్ 2011

తీన్‌మార్ - a contemporary love story !!!


నిన్న రాత్రి FAME CINEMASలో తీన్‌మార్ చూశాము. ఈ సినిమా మీద నా అభిప్రాయం ఇది!

Disclaimer :: నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు(నిజానిజి నేను ఏ తెలుగు, తమిళ నటుడికీ ఫ్యాన్ కాదు). ఎందుకు ఈ డిస్క్లైమర్ రాశానంటే కొంతమంది ఇద్ ఫ్యాన్‌స్ మాత్రం చూడతగ్గ చిత్రం అని ప్రచారం చేశారు గనుక!!

కథ ::
ఈ కథ మన తెలుగు సినిమాలకి కొత్తగా ఉంటుంది. "మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే; వెనక వచ్చువారికే అది దారి అయినది..." అన్నట్టుగా - తీన్‌మార్ టీం వారు ఈ కథని ఎన్నుకుని కొంత సాహసం చేశారు. మొన్నటి ANR-సావిత్రి సినిమాలనూ, నిన్నటి నాగార్జున, ఉదయ్ కిరణ్, తరుణ్ ప్రేమకథల సినిమాలను ఎలా అయితే కొనియాడుతున్నామో అలానే ఇంకో 5-6 years తర్వాత ఇటువంటి ప్రేమకథలున్న సినిమాలనుకూడా - ఈ సినిమాని as isగా మెచ్చుకోకపోయినా ఇటువంటి లవ్ స్టోరీస్ ముందు ముందు వస్తాయి. ఎందుకలా అంటానంటే, ఏ కాలంలోనైనా జనాధరణ పొందే నవలలూ, సినిమాలూ కొంతవరకు contemporary లైఫ్ స్టైల్ ని ప్రతిబింబిస్తుంది. ఇలాంటి ప్రేమలు మధ్యతరగతి వారి జీవితాల్లో ఎక్కువ లేకపోయినా ఇప్పుడిప్పుడే ఇటువంటి ప్రేమలు మొదలౌతున్నాయి. అంగీకరించటానికి కొంచం కష్టం అనిపించినా ఇదే సత్యం. ఒకప్పటి సినిమాళ్ళో నాయకుడూ, నాయికా అసలు మాట్లాడుకోరు. చూపులతోనే ప్రేమించేవారు. ఆ పైన వచ్చిన సినిమాళ్ళో ప్రేమికులు మాట్లాడుకునేవారు; అయితే తాకరు. కొన్నాళ్ళకి ఊరికే ఒకరు చేయి ఒకరు పట్టుకునేవారు. కొన్నాళ్ళకు భుజాలమీద చేయివేసుకునేవారు, బైకులో హీరో భుజం మీద హీరోయిన్ ఒక చేయివేసుకుని కూర్చునేది. మళ్ళి కొన్నాళ్ళకు, హీరోని గట్టిగా వాటేసుకుని ఏకంగా హీరోవీపున నిద్రపోతుంది. బుగ్గల మీద ముద్దులుకాస్త లిప్ లాకులు దాక వచ్చేసిందంటే తెలుగు సినిమా ఎదుగుతూ ఉందనేగా అర్థం? సో ఈ సినిమా లిప్-లాకు జెనెరేషన్ కి మొదటి మెట్టు. ఆ రోజుల్లో అమ్మాయి ఒప్పుకుంటే పార్టి ఇచ్చి పండగచేసుకునేవారు. ఇప్పుడు బ్రేక్-అప్ పార్టీలదాక వచ్చింది. పవన్-త్రిష ఇద్దరు కలిసి స్నేహితులకి బ్రేక్-అప్ పార్టి ఇస్తారు. ప్రేమకు ముందే(పెళ్ళికి ముందే కాదు) ఒకే గదిలో కలసి పవళిస్తారు.

మొడట ఒక గంట సినిమా బోరుగా అనిపించచ్చు - మన సంస్కృతికి ఇటువంటి కథ కొత్తకాబట్టి జీర్ణించుకోటానికి ఆ గంటసమయం అయింది నాకు. ఆపైన ఇదే రియాలిటి అన్న నిజాన్ని అంగీకరించుకుంటే సినిమాని ఆస్వాదించగలము.

పవన్ & త్రిష ::
పవన్ గురించి చెప్పేందుకు పెద్దగా ఏంలేదు. అతని ట్యాలంట్ ఇది సులువైన పాత్రే. మొట్ట మొదట మరింత క్లోజ్గా హీరోయిన్‌లతో మెలిగడం కొంత ఇబ్బందనిపించిందేమో.  కొన్ని mannerisms నాకు వెకిలి చేస్టల్లా అనిపించాయి. అవిపక్కనపెడితే He is perfect for the role అనిపించింది.

త్రిష నాయిక పాత్రకు సరిపోయింది. బాగుందికూడానూ. నేను ముసలోణ్ణైపోయానేమో మరి ఈ సినిమాలోకంటే "అతడు", "అభియుం నానుం/ఆకాశమంత", "విణ్ణైత్ తాండి వరువాయా/ఏం మాయ చేశావే", ఆడవారి మాటలకు..." సినిమాలలో బాగ నచ్చింది. ఈ సినిమాలో దుస్తుల్లో కొంచం పొదుపుచూపింది. అదొక కారణమైయుండచ్చు నాకు త్రిష ఏదోలా అనిపించటానికి.

Dialogs ::

త్రివిక్రం గారి సంభాషణలు - I enjoyed each and every minute of the movie for this great man! He has done a wonderful job. Witty dialogs. At times touching too త్రిష పాత్ర కొన్ని అందమైన డయలాగులు మాట్లాడుతుంది - ఇక్కడ రాయను; అవి సినిమాలో వినవలసిందే :-)పాటలు ::
మణిశర్మ అంత గ్రేట్ ట్యూన్‌లు ఇవ్వలేదేమో. అయినా గీతరచయితలు(భాస్కరభట్ల, రహమాను, విశ్వా, రామజోగయ్య శాస్త్రి) బారాశారు పాటలు.

Others ::
మంచి లొకేషన్‌లలో షూట్ చేశారు. కనులవిందుగా ఉంది.