23 డిసెంబర్ 2010

నళినివో హరిణివో తరుణివో మురిపించే ముద్దుల గుమ్మా!

వారం క్రితం (ఆడియో) రిలీస్ అయిన "కుదిరితే కప్పు కాఫి" సినిమ పాటలు విన్నాను. అన్ని పాటలూ బాగున్నాయ్. ఈ మధ్యకాలంలో విడుదలైన ఏ సినిమాలోనూ అన్ని పాటలూ నన్ను ఆకుట్టుకోలేదు. ఏంటో ఈ సినిమాలో అన్ని పాటలూ అద్భుతంగా ఉన్నాయి. బాగ మెలోడియస్ గా స్వరపరిచారు అన్నిపాటల్నీ. శబ్ధాలకన్నా సాహిత్యానికీ, ట్యూన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సంగీత దర్శకులు యోగీశ్వర్ శర్మ గారు. ట్యూన్ లూ సన్నివేశాలూ అభినందనీయంగ ఉన్నపుడు ఏ రచయితైనా తన కవితా విశ్వరూపం చూపించాలనుకుంటాడు. అందులోను భావుకతకు ప్రియశిష్యుడైన సిరివెన్నెల గారికి అలాంటి అవకాశం వస్తే ఇక బృందావనంలో వేణుగానమే. వినేవారి చెవుల్లో తేనెపోసినట్టు తియ్య తియ్యగా రాస్తారు. అందులో ఓ పాటను బాలు గారు పాడారంటే ఎలా ఉంటుంది?

ఆ పాట ఇదే.. వినక్కర్లేదు, పాడనక్కర్లేదు,  ఊరికే  చదివినా ఎంత బాగందో.


రచన : సిరివెన్నెల
గళం : బాలు
చిత్రం : కుదిరితే కప్పు కాఫీ
సంగీతం : యోగీశ్వర్ శర్మ
 
పల్లవి
శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కల నాహ్వానిస్తూ
నీ కనులెటు చూస్తున్నాయే మాక్కూడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదోగుట్టు దాక్కుందే బంగరు బొమ్మా

కోరస్ :
జలజలజల జాజుల వాన కిలకిలకిల కిన్నెర వీణా
మిలమిలమిల మిన్నంచులపైన మెలి తిరిగిన చంచలయానా
మధురోహల లాహిరిలోన మదినూపే మదిరవె జాణా

చరణం 1
నీ నడకలు నీవేనా చూసావా ఏనాడైనా
నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో
గమనించవు కాస్తైనా నీ వెనకాలేమౌతున్నా
నీ వీపుని ముళ్ళై గుచ్చే కునుకెరుగని చూపులు ఎన్నో
లాస్యం పుట్టిన ఊరు లావణ్యం పెట్టని పేరు
లలనా తెలుసో లేదో నీకైనా నీ తీరు
నీ గాలే శోకినవారు గాలిబ్ ఘజలైపోతారు
నీ వేలే తాకినవారు నిలువెల్లా వీణౌతారు
కవితవో యువతివో ఎవతివో గుర్తించేదెట్టాగమ్మా?

చరణం 2
నక్షత్రాలెన్నంటూ లెక్కెడితే ఏమైనట్టు
నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు
ఎక్కడ నా వెలుగంటూ ఎప్పుడు ఎదురొస్తుందంటూ
చిక్కటి చీకటినే చూస్తూ నిద్దురనే వెలివేయద్దు
వేకువనే లాక్కొచ్చేట్టు వెన్నెలనే దారం కట్టు
ఇదిగో వచ్చేనంటు తక్షణమే హాజరయ్యేట్టు
అందాక మారం మాని జోకొట్టవే ఆరాటాన్ని
పొందిగ్గా పడుకో రాణీ జాగారం ఎందుగ్గానీ
నళినివో హరిణివో తరుణివో మురిపించే ముద్దుల గుమ్మా 

================================================

rachana : sirivennela
gaLaM : baalu
chitraM : kudiritE kappu coffee
sangeetaM : yOgeeSwar

pallavi
SrIkAraM chuDutunnaTTu kammani kala naahvaanistU
nee kanuleTu chUstunnaayE maakkUDaa chUpinchammaa
prAkAraM kaDutunnaTTu rAbOyE panDaga chuTTU
nee guppiTa EdOguTTu dAkkuMdE bangaru bommA

kOras :
jalajalajala jaajula vaana kilakilakila kinnera veeNaa
milamilamila minnanchulapaina meli tirigina chanchalayaanaa
madhurOhala laahirilOna madinUpE madirave jaaNaa

charaNaM 1
nee naDakalu neevEnaa chUsaavaa EnADainA
nee mettani aDugula kinda paDi naligina praaNaalennO
gamaninchavu kaastainaa nee venakaalEmautunnaa
nee veepuni muLLai gucchE kunukerugani chUpulu ennO
laasyaM puTTina Uru laavaNyaM peTTani pEru
lalanaa telusO lEdO neekainaa nee teeru
nee gaalE SOkinavaaru gaalib ghajalaipOtAru
nee vElE taakinavaaru niluvellaa veeNautaaru
kavitavO yuvativO evativO gurtinchEdeTTaagammaa?

charaNaM 2
nakshatraalennanTU lekkeDitE EmainaTTu
nee manasuku rekkalu kaTTu chukkallO viharinchETTu
ekkaDa naa veluganTU eppuDu edurostundanTU
chikkaTi cheekaTinE chUstU nidduranE velivEyaddu
vEkuvanE laakkocchETTu vennelanE daaraM kaTTu
idigO vacchEnanTu takshaNamE haajarayyETTu
andaaka maaram maani jOkoTTavE aaraaTaanni
pondiggaa paDukO raaNee jaagaaraM enduggaanee
naLinivO hariNivO taruNivO muripinchE muddula gummaa 
================================================

1 కామెంట్‌:

Pranav Ainavolu చెప్పారు...

సూపర్... నాకు చాలా చాలా నచ్చేసింది. గూగుల్ చేస్తే మీ బ్లాగ్ లింక్ దొరికింది. భూమి గుండ్రంగా ఉందని మరో సారి ప్రూవ్ అయింది :)

సాహిత్యం రాసి పెట్టినందుకు ధన్యవాదాలు!