04 సెప్టెంబర్ 2011

చెల్లాయికి...


ఈ కార్తీకమొస్తే ఇరవైరెండు వసంతాలొస్తాయి నీకు.
దారిన వెళ్ళే కొత్త జంటలూ,
పట్టుచీరల, నగల కొట్లవారి భారీప్రకటనలూ
గుర్తుచేస్తున్నాయి - నీకు వరుడ్నిచూడాలన్న నా బాధ్యతను!

చక్కగా చదువుకున్నావు
ఉద్యోగం చేస్తున్నావు
చేతినిండా సంపాదిస్తున్నావు
నీకు సరితూగే వరుడ్ని కనుక్కోవాలి!
ఎక్కడ వెతకాలి మంచివారిని?
ఆ మంచివారిలో సరైన వరుడెవరనని ఎలా తెలియాలి?
కనుపాపలా నిను కాచుకునే పురుషోత్తముణ్ణెలా గుర్తించాలి?

ఎవరినైనా వలపించావా అనడిగాను
నువ్వు వలపించేంత గొప్ప పురుషపుంగవులెవ్వరినీ
ఇదివరకు కలుసుకోలేదన్నావు.

నా స్నేహితుళ్ళో ఎవరికీ
నిను వరించే యోగ్యత లేనట్టే అనిపిస్తుంది!
నీ స్నేహితులను పరిశీలిద్దామనుకున్నాను
ఎవరూ నెగ్గరు!

కోట్లూ, కనకాభరణాలూ అడిగేవాళ్ళను
మగవారిగా పరిగణించలేకున్నాను

నేనుకోరుకునే గుణసంపదలుకలిగిన ఒకరిద్దురు పురుషశ్రేష్టులు
దైనికభత్యంతో పూటగడిపే దశలో ఉన్నారు
అంటే నిను రాణిలా చూసుకోడం వారికి వీలుకాదు!
నువ్వు పేదలింట కష్టాలు పడటం
ఓర్వలేను నేను!

మన ఇంటేమీ కనకపుకంచంలో తినేంత సిరుల్లేవు
నూలుబట్టలూ, రాగియంబిలితోనే పెరిగావు
మెట్టినింటైనా నువ్వు సుఖపడాలనే కోరుతుంది నా మనసు!

అందుకే వెతకాలి
అనురాగంలోనూ, గుణములోనూ, సిరిసంపదలోనూ
మేలిమైన వరుడికోసం!

రాముడే మళ్ళీ జన్మెత్తివచ్చినా తిరస్కరిస్తాను!
చిన్నితల్లీ వద్దు - 
సీతలా నిత్యం శొకిస్తుంటే చూళ్ళేను నిన్ను!

"బ్రతుకు నిత్యపోరాటం
వెనుతిరగక పోరుసాగించు -
అప్పుడే జీవితం ఆనందాల వేడుకవుతుంది"
నా మాటలను నాకే గుర్తుచేస్తున్నావా?
అది నీక్కాదు - నాకూ, నన్ను అనుసరించేవారికీ మాత్రమే!


===========================================================
 2001 ఆగస్టు 19 న తిణ్ణై తమిళ పత్రికలో ప్రచురించబడిన నా తమిళ కవితయొక్క తెలుగు అనువాదం ఇది. 
===========================================================

తమిళ కవిత లింకు...

15 కామెంట్‌లు:

kiran చెప్పారు...

నాకు నచ్చేసిందోచ్...:)
చాలా బాగుంది..
అన్నయ్య మనసు వెన్నపూస..:)

Unknown చెప్పారు...

రాముడే మళ్ళీ జన్మెత్తివచ్చినా తిరస్కరిస్తాను!
చిన్నితల్లీ వద్దు -
సీతలా నిత్యం శొకిస్తుంటే చూళ్ళేను నిన్ను!
చాల బావుంది.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చాలా బాగుంది..యెన్నిసార్లు చదివానో ! చెల్లికి .. బ్రతుకు పోరాటం కాకూడదని కోరుకునే అన్న స్వార్ధం మనిషి తనం మనసు తనం చాలా గొప్పగా ఉంది.తెలుగు అనువాదంలా లేదు. సంశయించకండి .చాలా బాగా భావప్రకటన వచ్చింది.దాచుకోక మరిన్ని కవితలు..చెప్పండి.

శ్రీనివాసమౌళి చెప్పారు...

chalaa baagundi kavita.. Sailabala quote chesina lines adiraayi.. last lO sudden gaa positive philosophy kavita flow lo imaDalEdEmO anipistOndi.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

వావ్ చాలా బాగుందండీ..

ఆ.సౌమ్య చెప్పారు...

తమిళ్ లో కవితలు రాసారా...అమ్మబాబోయ్ మీరు సామన్యులు కాదు సుమండీ!

కవిత చాలా బావుంది.

సీత చెప్పారు...

super!

marpuri Lokesh చెప్పారు...

Chala chala bavundhi bhaskar garu.

జ్యోతిర్మయి చెప్పారు...

చాలా బావుంద౦డీ చెల్లాయి మీద ప్రేమ.

Bolloju Baba చెప్పారు...

చాలా బాగుంది.
వలపించు పదప్రయోగం కొత్తగా ఉంది

ఫోటాన్ చెప్పారు...

చాలా బాగుంది

ఫోటాన్ చెప్పారు...

చాలా బాగుంది

pavani చెప్పారు...

wow Entha bagundo ee annayya manasu ....EE annayya ma annayya aithe chala baguntundi sumandi...

లక్ష్మీ శిరీష చెప్పారు...

Hay batboy!!! Bhaskar garu..... Super :)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

Thanks, Sireesha gaaru.