27 ఆగస్టు 2012

మగవారింతే.. మారరు!

కొన్ని వేల సంవత్సరాలుగా మకరితో పోరు సాగిస్తున్నాడు కరి రాజు. ఇక తనవల్ల కాదు అనుకున్న క్షణంలో మైండ్ మెసేజింగ్ సర్వీస్(MMS) ద్వారా ఒక్కమారు వేడుకున్నాడు విష్ణుమూర్తిని.
 
మగవారు బయట ఉన్నప్పుడు కొంత సావకాశంగా, తీరిగ్గా ఉంటారేమో గానీ ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా కూర్చుని ఉంటారాండీ? ఉండాలనుకున్నా ఉండనిస్తారా? ఎన్నిపనులంటగడతారో కదా? పోరాడుతున్న కరికేం తెలుసు ఈ వేళ విష్ణుమూర్తి ఇంట్లో ఏ పనిలో తలమునకలై ఉన్నాడో? తెలియక ఎంఎంఎస్ పంపేశాడు కరి. అందుకోగానే క్షణమైనా ఆలస్యం చెయ్యలేదు హరి. వెంటనే పరుగుతీశాడు కరిని ఆదుకోడానికి.
సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం జేదోయ సంధింపఁ డే
పరివారంబును జీరఁ డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తరధమ్మిల్లుముఁ జక్కనొత్తుఁడు వివాదప్రోత్థిత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై!
సిరికి చెప్పడు, శంఖమందుకోడు, చక్రం వేలికి తొడగడు, గరుత్మంతుని పిలవడు. విల్లంబులందుకోడు. ఇవన్నీ చెయ్యడానికి ఒక్క క్షణంపడుతుందా? కరి-మకరి యుద్ధం వేలసంవత్సరాలుగా జరుగుతోంది. ఒక్క క్షణం ఆలస్యంగా వెళితే వచ్చే నష్టం ఏంలేదని అతివివేకవంతుడైన విష్ణుమూర్తికి ఎందుకు తోచదు? అట్‌లీస్ట్ శ్రీదేవితో ఒక్కమాట చెప్పి వెళ్ళొచ్చుగా? పైగా తన చేతిలో ఉన్న ఆమె చేలాంచలమైనా వీడకుండా లాక్కుపోయాడట!  కరిరాజును ఆదుకోవడం ముఖ్యమైన పనే. కాదని ఎవరన్నారు? ఎంత ముఖ్యమైన పనైనా సరే, మనసులో కొలువున్న మహరాణికన్నా ఎక్కువా ఆ పని? కాదు.. కానే కాదు. అయినా ఎందుకిలా చేశాడు? అది మగవాడి making లో ఉన్న defect! వాళ్ళ బుర్రలోకి ఏదైనా emergency పని occupy అయితే ఆ పని పూర్తయ్యేవరకు వివేకానికి విరామం ఇచ్చేస్తారు... విల్లునుండి విడువడిన అంబులా ప్రవర్తిస్తారు మగవారు.

పోతన ఎందుకు ఈ మత్తేభాన్ని "సిరికిం జెప్పడు" అని ఆమెతో ఎందుకు మొదలుపెట్టాడూ? మనసిచ్చిన మగువకన్నా ప్రధానమైనది మరొకటిలేదు వివేకమున్న మగవాడికి! అలాంటిది ఆమెకు కూడా చెప్పకుండ(లెక్క చెయ్యకుండ?!) పరుగుతీశాడంటే అది ఏదో ఒక అత్యవసర పరిస్థితి అయ్యుంటుందన్నది గ్రహించండి అని లోకానికీ, మహిళాలోకానికీ.. గట్టిగా చెప్తున్నాడు పోతన.


ఆఫీసునుండి అర్జంట్ అని ఫోన్ వస్తే షర్ట్ బటన్ పెట్టుకున్నాడో లేడో, లేప్టాప్ ఛార్జర్ బేగ్ లో వేసుకున్నాడో లేదో, ఇవన్నీ చేసినా చేయకపోయినా ముఖ్యాతిముఖ్యమైన ఇల్లాలికి "వెళ్ళొస్తానోయ్" అని చెప్పనైనా చెప్పాడో లేదో..  పరుగోపరుగున వెళ్ళిపోతాడు; అది వాడి మేకింగ్ డిఫెక్ట్! ఈ మాత్రం దానికి మీరే కోపశిఖరాలూ ఎక్కకండి. ఆ ఎమర్జెన్సీ అయిపోగానే మొట్టమొదట గుర్తొచ్చేది మీరే గనుక కాస్త సహనం పాటించడం ఉత్తమం అని ఆడువారికి గట్టిగా చెప్పదలచుకున్నాడు కాబట్టే "సిరికిం జెప్పడు.." అని మొదలుపెట్టాడు పద్యాన్ని. విష్ణుమూర్తే అలా చేసినప్పుడు మామూలు మగవాడేం మినహాయింపు కాడు గదా!


"నీ చేలమైనా వీడక పరిగెట్టాను సుమా, అయినా నువ్వు కోపం తెచ్చుకోనే లేదేం!" తాను చేసిన పనికి నొచ్చుకుని శ్రీదేవిని మన్నింపడిగాడు. మగమహరాజులూ వింటున్నారా? సహనం వహించిన సతికి మెచ్చుకోలివ్వడం మరువకూడదన్నమాట. ఆ పై ఆమె దేవర యడుగులు అనుసరించడం తన విధి అని నవ్వుముఖంతో చెప్పనే చెప్పింది. సాదరసరససల్లాప మందహాసపూర్వక ఆలింగనమూ పొందిందట. మగువలూ.. వింటున్నారా? 

 

27 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

చిన్నగా సూటిగా చాల బాగా రాశారు.
బాగుంది ఆ లోకాన్ని..ఈ లోకాన్ని మిళితం చేయటం మరియు అర్ధం వివరించటం.:)

సీత చెప్పారు...

You are too good annayya!

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

పుట్టినరోజు సంగతి మరచారా, ఆఫీస్ పనిలో పడి?

madhumanasam చెప్పారు...

ఇంతకీ వినవలసిన వాళ్ళు వినాలన్న మీ 'ఆశ" తీరిందో లేదో! :)
ఏ అక్కర్లేని బగ్ ఫిక్సింగ్ కోసమో పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోవడం, ఆనక ప్రపంచం ముందు ప్రాయశ్చితాలూనా? మేం ఒప్పుకోం! అయినా పోతన మధ్యలో వ్రాసిన ఎన్ని వేల పద్యాలు "ఎడిటింగ్"లో తీసేశారో మీకూ నాకూ ఎలా తెలుస్తుంది :))

కొత్తావకాయ చెప్పారు...

దేవా దేవరయడుగులు, భావంబున నిలిపి కొలుచుపని నాపని గా
కో వల్లభ యే మనియెద, నీ వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతీ

ఇలా అనేంత అమాయకురాలు దొరికితే, ఆటలు చెల్లవా మరీ! ఆ వైష్ణవీరత్నానికి వఠ్ఠి ఆలింగనంతో సరిపెట్టేసాడు చూసారా! అన్యాయం!

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

@శేఖర్ : థ్యాంక్స్.

@సీత : :-))

@రహ్మాన్ : అంతలేదు! కంప్యూటరైస్జ్ క్యాలెండర్లూ, స్మార్ట్ ఫోన్లూ ఉన్న ఈ కాలంలో బర్త్‌డేలు మరిచిపోవడమా? నో వే!

@మధుమానసం :
హాహా..

rajachandra చెప్పారు...

wow.. :)

చాణక్య చెప్పారు...

తప్పొప్పేసుకోండీ.. తప్పదు! బాగా రాశారు గానీ ఈ విషయంలో నా ఓటు మీకు లేదు. :)

శివరంజని చెప్పారు...

తెలుగులో నిందా స్తుతి అలంకారం ఉంటుంది ... ఆ అలకారాన్ని చక్కగా ఉపయోగించడం లో మీరు సిద్ద హస్తులు అనుకుంటా అవినేని గారు ...

ఓ పక్క నుండి హోం డిపార్ట్మెంట్ అంటే భయం భక్తీ చూపిస్తున్నట్టుగా వాళ్ళని బ్రతిమాలుకుంటూనే .......... ఇంకో పక్క నుండి లేదు మా అబ్బాయిలకి బోలెడు పనులుంటాయి అమ్మాయిలు అర్ధం చేసుకోవాలి అని మా అమ్మాయిలకి వాతలు వేస్తూ మీ అబ్బాయిల ని గొప్పగా ప్రమోట్ చేసుకుంటున్నారు కదా .. పాపం హోం డిపార్ట్మెంట్

అజ్ఞాత చెప్పారు...

నిందాస్తుతి కాదు. దాన్ని వ్యాజస్తుతి అంటారు.

Indian Minerva చెప్పారు...

అసలిది రాయడంలో మీ ఉద్దేశ్యమేమిటోనని ఒక చిన్న అనుమానం.

ముందరి కాళ్ళకు బంధాలంటారు అదా? :)

ముందే తయారు చేసిపెట్టుకున్న అస్త్రంలా ఉంది.

జ్యోతి చెప్పారు...

hmmm... ఏమన్నా అంటే అలనాడు ఆ శ్రీహరి కూడా ఇంతే . ఇక మేమెంత అంటారు.. కానివ్వంఢి.. మీరలా మాయ చేస్తూనే ఉంటారు(అలా అనుకుంటారు) మేమలా నమ్మేస్తుంటాం (అని మీరనుకుంటారు.)) :))

ఆ.సౌమ్య చెప్పారు...

బావుంది బావుంది..ఈ కల్లబొల్లి కబుర్లకు కాలం చెల్లింది...ఆనాటి సిరా నవ్వుతూ సహనాన్ని ప్రదర్శించడానికి!! అబ్బే లాభం లేదు...సచ్ దాల్స్ వోంటు బాయిలూ! :)

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

"చెప్పకుండ(లెక్క చెయ్యకుండ?!)"

చెప్పకుండా అంటే లెక్క చెయ్యకుండా అని అర్ధం చేసుకోవడం ఆడ వాళ్ళ మేకింగ్లో ఉన్న డిఫెక్ట్ బావ. అలాంటి డిఫెక్ట్ లని మనం లెక్క చెయ్యకుండా సహజీవనం సాగించాలి. మనుగడ కొనసాగించాలి. సృష్టిని చెయ్యాలి. ఆహో! ఈ కష్టాలు ఆ శ్రీ హరికి తప్పలేదు కదా!

Chandu S చెప్పారు...

చాలా బాగా రాశారండీ. ఇరువైపులకు బాగా రాజీ చేసారు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

హేమిటో!
మేకింగ్ లో నే డిఫెక్ట్ అని తమను తామే నిందించుకొనే వరకూ సంజాయిషీ ఇచ్చుకుంటూ ఉండడమెందుకో??

ఇదే పని ఆడవాళ్ళు చేస్తే " ఏమి?మా మీద నమ్మకం లేదా, ఏదో పని మీద వెళ్ళి ఉంటాము, ఏం మేము మీ బానిసలమా ? సమానత్వం జిందాబాద్ " అంటూ దబాయించేస్తారు ఆడవాళ్ళు మరి. (చూశాం కాబట్టే చెపుతున్నాము.)
భార్య అడిగితే మనసులో కొలువున్న మహారాణి, మనసిచ్చిన మగువ అని అలంకారంగా చెప్పడం ఏమిటో,
భర్త అడిగితే పురుష దురహంకారం అంటూ కారంగా చెప్పడం ఏమిటో??
ఆవినేని భాస్కర్ గారు,
జనరల్ గా చెప్పానండి. మీకు అన్వయించుకొని కోపం తెచ్చుకోకండి.

'''నేస్తం... చెప్పారు...

Super Post :)

kiran చెప్పారు...

:))) :P

జలతారు వెన్నెల చెప్పారు...

బాగుంది

శశి కళ చెప్పారు...

బాబ్బాబు ..నీకు పుణ్యం ఉంటుంది...ఇలాటివి ఒక వంద వ్రాసి ఇక్కడ శశి వల్లభునికి పోస్ట్ చెయ్యి

లక్ష్మీ శిరీష చెప్పారు...

బాగుంది అండి :) MMS వివరణ , మగవారి పనులను - " అవంతే! సర్దుకుపోవాలి ! " అని మీరు చెప్పిన తీరు చాలా ముచ్చటగా వుంది. ఇక ఫై ఇలాంటి సందర్భాలు ఎదురైతే , కోపం రాదేమో!!! :)

శ్రీ చెప్పారు...

మొత్తానికి మగవారి పక్షం వహిస్తూ...:-))
గజేంద్రమోక్షం తో లింక్ చేసేసారు...
అబినందనలు మీ ప్రస్తుతీకరణకు...
@శ్రీ

కౌటిల్య చెప్పారు...

బావా! ఎందుకో టపా చదుతుంటే కళ్ళంట నీళ్ళొచ్చాయి...

Ennela చెప్పారు...

hahaha..."sorry" mantram undane undigaa..."gilpost baagundi bhasladam-bujjaginchadam".postu baagundi bhasker garu

Rajasekhara Reddy చెప్పారు...

చాలా బాగుంది భాస్కర్ గారు. అభినందనలు

ennela చెప్పారు...

naa pai comment lo aksharaalanne gazibizi gaa post ayyaayi .." baagundi, gilladam bujjaginchadam" ani wraasaanannamaata

భాస్కర్ కె చెప్పారు...

వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు.