28 జూన్ 2011

Vairamuthu / వైరముత్తు - అరవకవికి ఆరోసారి జాతీయ ఉత్తమ గేయరచయిత పురస్కారం... 2011


ఆరోసారి జాతీయ ఉత్తమ గేయరచయిత పురస్కారాన్ని అందుకున్నారు తమిళ గేయ రచయిత కవిరారాజు వైరముత్తు గారు. ఆయన రచనలు తెలియని తమిళవారుండరు. తెలుగువారిక్కూడా చాలామందికి ఈయన పరిచయం. తమిళంలో ఈయన రాసిన పాటల్ని తెలుగులోకి డబ్బింగు చేసినప్పుడు అక్కడక్కాడా ఈయన రచించిన కొన్ని గొప్ప భావాలు తెలుగువారినీ అలరిస్తూనే ఉంటాయి. 

ఎన్ని రాజికీయాలున్నా, ఎందరు సిపారుసులు చేసినా ఒక్కసారి వస్తుందిగానీ ఆరుసార్లు ఒకే కవికి జాతీయ ఉత్తమ గేయరచయిత పురస్కారాలు(National Award) రావు కదా? సత్తా ఉన్నట్టేకదా?

భారతదేశంలో యే గీతరచయితకీ, కవికీ ఇదివరకు దొరకలేదు ఇంతటి అదృష్టం. ఈయన భాష, భావము తమిళ సాహిత్యానికి ఇంకా ఎన్నెన్నో కీర్తులను కట్టబెడుతుందని ఆశిస్తున్నాను.

ఆయనకి అరోసారి అవార్డు తెచ్చిపెట్టిన ఆ పాటను తెలుగులోకి అనువదిస్తున్నాను. కరువుప్రాంతంలో ఓ పల్లెటూరి తల్లి బాల్నీ, కష్టాల్నీ పాటగా రాశారు. ఇలాంటి తల్లులు ఎందరో ఉన్నారు మన దేశంలో. బిడ్డను పెంచేందుకు తల్లిపడే కష్టాలనూ, ఆమె జీవితాన్ని  మాటల్లో పొడిగించారు కవి. ఆయన అరవంలో రాసిన గొప్పభావాన్ని నాకు తెలిసిన పదాలతో అనువదించాను.

(తమిళంలో ఉన్న ప్రత్యేక "ళ" అక్షరం మనభాషలో లేదుకాబట్టి అక్షరాన్ని "zha" అని రాశాను. "zha" ఉన్న చోట తమిళ "ళ" పలకాలి)

==================================
==================================

పల్లవి
    కళ్ళి కాట్టిల్ పెఱంద తాయే - ఎన్న
    కల్లొడచ్చి వళత్త నీయే!
    ముళ్ళు కాట్టిల్ మొళచ్చ తాయే - ఎన్న
    ముళ్ళు తక్కె విడల నీయే!
నాగుతాళి(జెముడు) అడవుల్లో పుట్టిన తల్లీ - నన్ను రాళ్ళు కొట్టి పెంచావు
నువ్వు ముళ్ళ అడవిలో పుట్టినా నన్ను మాత్రం ముల్లంటకుండా పెంచావు.

    కాడైక్కుం కాట్టుకురువిక్కుం ఎండంపుదరుక్కుళ్ ఎడముండు
    కోడక్కుం అడిక్కుం కుళురుక్కుం తాయి ఒదుంగత్తాన్ ఎడముండా
కోలంకి పిట్టకీ, అడవి గువ్వకీ రేగుపొదల గూడున్నది
ఎండకీ, వణికించే చలికీ తలదాచుకుందుకు చోటుందా?
(నివసించేందుకు సరైన ఇల్లుకూడా లేదు ఈ పేద తల్లికి)
    కెరట్టు మేట్టైయే మాత్తునా - అవ
    కల్ల పుళింజి కంజి ఊత్తునా
మెరక నేలని దిద్దినది - ఆమె రాళ్ళుపిండి గంజి పోసినది.
(తల్లి బిడ్డను బాగా పెంచాలని ఎంత కాయకష్టమైనా చెయ్యగలదన్నది భావం)

    చరణం 1
    ఒzhaవు కాట్టుల వెద వెదప్పా
    ఓణాన్ కెరట్టుల కూzh కుడిప్పా
    ఆవారం కుzhaiయిల కై తొడప్పా
    పావమప్పా.....

దున్నేందుకే వీలులేని మిట్టనేలలో పంటచేస్తుంది
(ఆమెకు మాగాని పొలాలు లేవు)
తొండలు తిరిగే నేలలో అంబలి తాగేను!
(తింటున్నప్పుడుకూడా హాయిగా నీడలో కూర్చుని తినే సౌకర్యము లేదు - నీడనిచ్చే చెట్లుకూడా లేనటువంటి మెరక భూమి)
తంగేడు ఆకులతో చెయి తుడుచుకుంటుంది!
(తిన్నాక చెయ్ కడుక్కునేందుకుకూడా నీళ్ళు ఉండవు)
ఎంత కష్టమో జీవనం...

    వేలి ముళ్ళిల్ అవ వెఱగెడుప్పా
    నాzhi అరిసి వెచ్చి ఉలై ఎరిప్పా
    పుళ్ళ ఉండ మిచ్చం ఉండు ఉసుర్ వళప్పా
    త్యాగమప్పా...
కంచ కంపల్లో పొయ్యికి కట్టెలు ఏరుకుంటుంది
నూకలబియ్యముతో ఎసరు పెట్టుకుంటుంది!
(నాణ్యమైన బియ్యముకూడా లేని పరిస్థితి)
బిడ్డ కడుపునిండా తిన్నాక మిగిలిన ఆహారంతో సరిపెట్టుకుంటుంది!
ఎంత త్యాగశీలో...

    కిzhaక్కు విడియుమున్న ముzhiక్కిఱా
    అవ ఉలక్క పుడిచ్చిత్తాన్ పెఱుక్కుఱా
    మణ్ణక్ కిండిత్తాన్ పొzhaiక్కిఱా
    ఒడల్ మక్కిపోవుమట్టుం ఉzhaiక్కిఱా
తూరుపు దిక్కుకన్నా ముందే లేస్తుంది,
రోకలిలాంటి పరకతో(చీపురుతో) ఇల్లూ వాకిలి ఊడుస్తుంది
(చీపురు కొనలు బాగా అరిగిపోయి రోకలిలా అయిపోయింది!)
మట్టిపిసుక్కుంటూ జీవిస్తుంది; ఒడలు మగ్గిపోయేలా శ్రమిస్తుంది!

    చరణం 2
    తంగం తనిత్ తంగం మాసు ఇల్ల
    తాయ్ పాల్ ఒణ్ణు మట్టుం దూసు ఇల్ల
    తాయ్ వzhi సొందం పోల పాసమిల్ల
    నేసమిల్ల...

స్వచ్ఛమైన బంగారంలో ఎలాగైతే మలినముండదో
అలా ప్రపంచంలో తల్లిపాలు మాత్రమే దూషితములేనిది!
అమ్మలేగే, అమ్మతరపు బంధువులు చూపే ఆప్యాత వేరే బంధువులు చూపలేరు.

    తాయి కైయిల్ ఎన్న మందిరమో
    కేప్ప కలియిల్ ఒరు నెయ్ ఒzhuగుం
    కాయంజ కరువాడు తేన్ ఒzhuగుం
    అవ సమైక్కైయిలే...

తల్లి చేతిలో ఏమి మంత్రముందో తెలియదు; 
ఆమె చేసే రాగి సంగటిలో నెయ్యి కారుతుంది,
ఎండు చేపకూరలో తేనె రుచుంటుంది!
అమ్మ వంటలోనే సాధ్యమిది...
(అమ్మ చేతి వంట రుచి అటువంటిది)
    సొందం నూఱు సొందం ఇరుక్కుదే
    పెత్త తాయిపోల ఒణ్ణుం నెలైక్కుదా?
    సామి నూఱు సామి ఇరుక్కుదే
    అడ తాయి రెండు తాయి ఇరుక్కుదా?
బంధాలు వంద బంధాలున్నాయి
కన్న తల్లి ప్రేమకు సరివచ్చునా?
దేవుళ్ళు వందలకొద్ది ఉన్నారు
అయితే, తల్లి మాత్రం ఒక్కరేగా?కవిరారాజు వైరముత్తు గారికి అభినందనలు. 
ఈయన కవితలకు త్వరలో Nobel Prize వస్తుందని ఆశిస్తున్నాను...


-------------------------------------------------------------------------
చిత్రం : తెన్మేఱ్కు పరువక్కాట్ఱు (నరృతి ఋతుపవనము)
సంగీతం : రఘునందన్
గళం : విజయ్ ప్రకాష్
దర్శకత్వం : సీను రామస్వామి
================================================================
జెముడు-jemuDu / నాగుతాళి-nAgutALi / నాగుదాళి-nAgudALi

కోరంకిపిట్ట - kOraMki piTTa /  పూరేడుపిట్ట - pUrEDupiTTa


===================================================================
Search words : vairamuthu, vairamuttu, national award lyrics, tamil, telugu translation, meaning,
then merku paruvakkarru, thenmerku paruvakatru, paruvakarru, image, picture
===================================================================

6 వ్యాఖ్యలు:

vanajavanamali చెప్పారు...

అమ్మ గురించి.. ఎందరో.. కమ్మగా..వ్రాసారు.. కానీ..ఇంత..గా.. కన్నీరు చిందేలా.. వ్రాయలేదు..వైరముత్తు..గారి..కవి కలానికి..హృదయానికి.. "నీ బాంచన్ ..కాల్మొక్కుతా..కవీ.. అంటున్నాను.. భాస్కర్ గారు.. మరీ మరీ ధన్యవాదములు.. ఇలాగే మరిన్ని మంచి పాటలు..పరిచయం చేయండీ..ప్లీజ్!!!

అంతర్ముఖుడు చెప్పారు...

ఈయన నిజంగా కవిరాజే

అంతర్ముఖుడు చెప్పారు...

ఈయన నిజంగా కవిరాజే

ఆ.సౌమ్య చెప్పారు...

చాలా బాగా రాసారండీ, నాకన్నా ఎంతో బాగా అనువదించారు.
కరువాడు అంటే ఎండు చేప కదా...ఏంటో నేను డ్రై ఫ్రూట్ అని ఎందుకు అనుకున్నానో....లేకపోతే నాకలా వినిపించింది కాబోలు. చాలా బావుంది.

బొల్లోజు బాబా చెప్పారు...

అబ్బ ఏమి ఇమేజెస్ అండి. ఏమి ఇమేజెస్
ఆ సందర్భానికి తగినట్టుగా తీసుకొన్న ఉపమానాలు ఎంత గొప్పగా కలసిపోయాయి. ఆర్థ్రత ఆద్యంతం వెల్లివిరిసింది.

గొప్ప పద్యం
మాతృకలో కల లయ, ప్రాసలు అనువాదానికి లొంగవు కదూ!

మంచి ప్రయత్నం.

అవునూ... తమిళంలోని ఉత్తమ సాహిత్యం (మరీ భారతీయార్ కాలం నాటిది కాక) తెలుగులో పరిచయం చెయ్యొచ్చు కదా. కనీసం ఆధునిక కవులని, వారి కవిత్వ ఉదాహరణలతో..... ఇది మీబోటి ఉభయభాషా ప్రవీణులకే సాద్యపడుతుంది. అంతర్జాలంలో ఒక సారి నిక్షిప్తం చేసారంటే తక్షణ పఠనానందమే కాక, సెర్చ్ ఇంజన్ ల ద్వారా భవిష్యత్ అవసరాల కొరకు ఉపయోగపడుతుంది. ఆలోచించండి

తమిళ తెలుగు సాహిత్యాల మేలు కలయికగా మీబ్లాగు భవిష్యత్తులో ఉంటుందని ఆశిస్తున్నాను

భవదీయుడు
ధన్యవాదములతో
బొల్లోజు బాబా

Bhanukiran Perabathini చెప్పారు...

తెలుగులో "కవియరసు" మీద ఎవరైనా ఏమైనా రాసున్నారా అని ఆరా కొద్ది వెతికాను. మీ బ్లాగ్ లభ్యమైంది!

అద్భుతం!
తెలుగు వాళ్ళ కోసం మీరు చేసిన సేవకి కృతఙ్ఞతలు..

- ஒரு வைரமுத்து ரசிகன்!