07 మే 2011

కలవారి కోడలు కలికి కామాక్షి...

ఈ రోజుల్లోలాగ సినిమాలూ, టీవీలూ,  రేడియోలూ, పుస్తకాలూ, ఇంటర్నెట్టూ లేని రోజులవి. మరి వినోదాలూ, వేడుకలూ లేకుంటే జనాలకు ఎలా పొద్దుపోయేది? టెక్నాలజి లేదుకాని వినోదాలు మాత్రం ఉండేవి. మగవారు రచ్చబండలమీద కబుర్లు చెప్పుకునేవారు. పిల్లలు వీదుల్లో, మైదానాల్లో చెమటలు పట్టేలా ఆడుకునేవారు. ఆడవాళ్ళు ఆనందంగా పాటలు పాడుకుంటూ పనులు చేసుకునేవారు. సందర్భానికి, ఆయా ప్రాంతాల అలవాట్లకు తగ్గట్టుగా పాటలు ఉండేవి. వీటిని ఇప్పుడు మనము జానపద గీతాలనీ, స్త్రీల పాటలనీ కేటగ్రైస్ చేసుకున్నాము. అలాంటి ఒక జానపదపాటను నేనిప్పిడు పరిచయం చెయ్యబోతున్నా.
సన్నివేశం :
చెల్లిని అత్తగారింటినుంచి పుట్టింటికి తీసుకెళ్ళడానికి అన్నయ్య వెళ్ళాడు. అక్కడ జరిగే సంభాషణలూ, దృశ్యాలే ఈ జానపద పాట.

కలవారి కోడలు కలికి కామాక్షి
కడుగుచున్నది పప్పు కడవలో పోసి
అంతలో వచ్చెను ఆమె పెద్దన్న
కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీళ్ళు నింపె

అన్నయ్య :
ఎందుకు కన్నీళ్ళు ఏమి కష్టాలు
తుడుచుకో చెల్లెలా తుడుచుకో
పెట్టుకో సొమ్ములు కట్టుకో పట్టుచీర
ముడుచుకో కురులు, ఎక్కు అందలము
చేరి మీ అత్త మామలకి చెప్పిరావమ్మ

కోడలు :
కుర్చీ పీఠమీద కూర్చున్న అత్తా
మాయన్నలొచ్చారు మమ్మంపుతారా?

అత్త :
నేనెఱుగ నేనెఱుగ మీ మామనడుగు

కోడలు :
పట్టెమంచం మీద పడుకున్న మామా
మా అన్నలొచ్చారు మమ్మంపుతారా

మామ :
నేనెఱుగ నేనెఱుగ నీ అక్కనడుగు

కోడలు :
వంట చేసే తల్లి ఓ అక్కగారూ
మా అన్నలొచ్చారు మమ్మంపుతారా

తోడుకోడలు :
నేనెఱుగ నేనెఱుగ మీ భావనడుగు

కోడలు :
భారతం చదివేటి భావ పెదభావా
మా అన్నలొచ్చారు మమ్మంపుతారా

బావ 
:
నేనెఱుగ నేనెఱుగ నీ భర్తనడుగు

కోడలు :
రచ్చపై కూర్చున్న రాజేంద్రభోగీ
మా అన్నలొచ్చారు మమ్మంపుతారా

భర్త :
తుడుచుకో కన్నీళ్ళు ముడుచుకో కురులు
ఎత్తుకో బిడ్డను ఎక్కు అందలము
పోయిరా సుఖముగా పుట్టినింటికిని

కోడలు :
ఇరుగు పొరుగు జయమ్మలారా
చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు సేవింపబోయి
మరదలు పెళ్ళికి మరలి వచ్చేను
ఇరుగక్క పొరుగక్క ఇపుడే పోయివత్తు...

ఈ రోజుల్లో చెల్లెళ్ళని పుట్టింటికి తీసుకురావడానికి అన్నయ్యలు వెళ్తారా? వెళ్ళినా ఇంత భాగోతం ఉంటుందా అని అడక్కండి! ఈ రోజుల్లో కష్టాలు వేరే రకంగా ఉన్నాయి, చెల్లెళ్ళకి. ఆఫీసులో సెలవులు దొరుకుతాయా, boss ఏమంటాడో, client project schedule అనుమతిస్తుందా, ఇలాంటివి… :-)

చిత్రం : బాపు
==============================================

kalavAri kODalu kaliki kAmAkshi
kaDuguchunnadi pappu kaDavalO pOsi
antalO vachchenu Ame peddanna
kALLaku nILLichchi kanneeLLu niMpe

annayya :
eMduku kanneeLLu Emi kashTAlu
tuDuchukO chellelA tuDuchukO
peTTukO sommulu kaTTukO paTTucheera
muDuchukO kurulu, ekku andalamu
chEri mee atta mAmalaki cheppirAvamma

kODalu :
kurchee peeThameeda kUrchunna attA
mAyannalocchAru mammaMputArA?

atta :
nEne~ruga nEne~ruga mee mAmanaDugu

kODalu :
paTTemanchaM meeda paDukunna mAmA
mA annalochchAru mammaMputArA

mAma :
nEne~ruga nEne~ruga nee akkanaDugu

kODalu :
vaMTa chEsE talli O akkagArU
mA annalochchAru mammaMputArA

tODukODalu :
nEne~ruga nEne~ruga mee bhAvanaDugu

kODalu :
bhArataM chadivETi bhAva pedabhAvA
mA annalochchAru mammaMputArA

bAva :
nEne~ruga nEne~ruga nee bhartanaDugu

kODalu :
rachchapai kUrchunna raajEMdrabhOgee
mA annalochchAru mammaMputArA

bharta :
tuDuchukO kanneeLLu muDuchukO kurulu
ettukO biDDanu ekku aMdalamu
pOyirA sukhamugA puTTiniMTikini

kODalu :
irugu porugu jayammalArA
chelleLLa peLLiLLu sEvimpabOyi
maradalu peLLiki marali vacchEnu
irugakka porugakka ipuDE pOyivattu...
==============================================

6 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చిత్రం ఎంత బాగుంది.!! ఈ పాటలో.. . సీతారామయ్యగారి మనుమరాలు లో.. పాట గుర్తుకు తెచ్చింది. చాలా పాటలకి.. మూలం .. జానపద గీతాలు. పరిచయం బాగుందండీ!.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

Thanks, vanajavanamali garu :-)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

"సీతారామయ్య గారి మనవరాలు" సినిమాలో వేటూరి గారు ఈ పాటను ఆధారంగా తీసుకునే "కలికి చిలకల కొలికి మాకు మేనత్త..." పాటను రాశారు.
ఆ చిత్రం ఎక్కడొ ఇంటర్నెట్లో దొరికిండండీ..

కొత్త పాళీ చెప్పారు...

picture is Bapu painting from early days

ఆ.సౌమ్య చెప్పారు...

బావుంది, ఎక్కడ సంపాయించారు ఇది?
భావ కాదు బావ అని రాయాలి.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

కొత్తపాలి గారూ,
"చిత్రం : బాపు"
అని చేర్చానండీ, ధన్యవాదములు.


సౌమ్యా,
చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలాంటి పాటలు బోలెడన్ని పాడేది! కోంచం నా మెమరీలో సేవ్ అయ్యి ఉనింది. మా నాన్న గారి సాయంతో పూర్తి పాటను టైప్ చేశాను :)