20 జూన్ 2011

Home-work రాయని దేవుడు, ఆ శ్రీవెంకటేశుడు…



కొన్నేళ్ళక్రితం నేను ఏకాకిగా బెంగుళూరిలో ఉన్నప్పుడు మా అమ్మ నాన్నలు వచ్చి కొన్ని నెలలు  నాతోపాటు ఉండి వెళ్ళేవారు. వారితోబాటు మా అన్నయ్య గారి అబ్బాయి కూడా వచ్చేవాడు. వాడికి అప్పుడు 3 యేళ్ళుండేవి. చిన్నప్పట్నుండే మా అమ్మ నాన్నలు వాణ్ణి నిద్రపుచ్చేందుకు పాటలు పాడేవారు.  వాడు ఆ పాటలువింటూ నిద్రపోయేవాడు. “రామా లాలీ, మేఘశ్యామా లాలీ…”, “కస్తూరి రంగ రంగ…” వంటి పాటలు అడిగి మఱీ పాడించుకునేవాడు.

బెంగుళురికొచ్చినపుడేల్లా, నన్నుకూడా పాడమని ఏడిపించేవాడు. నాకు పాడటం చేతకాదన్న వినేవాడు కాదు. అప్పుడు నేను సెల్ ఫోన్ లో కొన్ని పాటల్ని ప్లే చేసేవాణ్ణి. అవి వింటూ  నిద్రపోవడమో, లేక నేర్చుకోవడమో చేసేవాడు. అలా నా దగ్గర అలవాటుపడినపాటల్లో కొన్ని “చందమామ రావే…” అన్న సిరివెన్నెల పాటా, “కొండలలో నెలకొన్న…” అన్న అన్నమాచార్య కీర్తన వంటివి.

“చందమామ రవే…” లో “గోగుపూలు అంటే ఏంటి, బాబాయ్?” అని అడిగేవాడు. “కొండలలో నెలకొన్న…” పాటకి అర్థం అడిగేవాడు. “కొండలలో నెలకొన్నవాడు అంటే శ్రీవెంకటేశుడు, దేవుడు!” అని చెప్పి ఆ పాట నేర్పించాను. వాడు చెన్నై వెళ్ళాక కూడా ఆ పాటలు ఆల గుర్తుపెట్టుకుని పాడుకుంటూ ఉండేవాడట. నేను వెళ్ళినప్పుడెల్లా పాడమనేవాడు.

కొన్నాళ్ళకి బళ్ళో(School) వేశారు. LKG, UKG లు అయ్యాయి. ఒకటో తరగతప్పుడు, ఒకానొక రోజు వాళ్ళ అమ్మ (మా వదిన గారు) ఫోన్ చేశారు. వాడు హోం-వర్క్ నోట్స్ రాయనంటున్నాడని! ఎందుకు అని అడిగితే “దేవుడే హోం-వర్క్ రాయడు. నేను మాత్రం ఎందుకు రాయాలి?” అంటున్నాడట. అలా ఎవరు చెప్పరని అడిగితే “బాబాయ్ నేర్పించాడు” అన్నాడట. నేను షాక్ అయ్యాను.

“కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు” పాటలోని “రాయడు వాడు” కి ఇలా “హోం-వర్క్ నోట్స్ రాయడం, చదవడం” లాంటి అర్థాలు వెతుక్కున్నాడు ఈ పిల్లాడు.  అందుకే అన్నమయ్య ఇలా అన్నారేమో “ఎంత మాత్రమున యెవ్వరు తలచిన అంతమాత్రమే నీవు”

9 కామెంట్‌లు:

మధురవాణి చెప్పారు...

How cute! :))

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పసి పిల్లల మనసులు ..తెల్ల కాగితం. ఏదైనా ముద్ర పడితే.. వాళ్ళంత వాళ్ళు తుదిచివేసుకోవాలి తప్ప తుడిచే ఎరేసర్ మనదగ్గర ఉండదు. చాలా బాగుంది..

ఆ.సౌమ్య చెప్పారు...

హహహ మీ వాడికి బలే తెలివితేటలు....very sweet!

గిరీష్ చెప్పారు...

:-)
రాయడు వాడు.. రాయడు వాడు.. రాయడు వాడు..
super

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

@మధురవాణి : Thank you!.
@vanajavanamali : పసి పిల్లల మనసులు తెల్ల కాగితం - నిజమేనండి! చిన్నపిల్ల్లాడి మొత్తం కీర్తనకి అర్థం చెప్పినా ఏమర్థమౌతుందిలే అనుకోవడం నా తప్పే...
Thanks for you comment.

@ఆ.సౌమ్య : Thank you. ఇలాంటి తెలివితేట్లు ఈ కాలం పిల్లలందరికీ ఉన్నట్టున్నాయండీ...

@గిరీష్ గారూ, ఇప్పుడు రాస్తున్నాడట :)

kalyan చెప్పారు...

Very nice :) liked it !

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

Thanks, Kalyan :)

kiran చెప్పారు...

హాహాహ భాస్కర్ గారు :))
భలే అబ్బాయి...:)

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హా.. నిజంగా పిల్లల తెలివితేటలు భలే ఉంటాయి.. అసలు వాళ్ల క్రియేటివిటీ ముందు మనం ఏం పనికొస్తాం..
టపా అద్భుతం భాస్కర్ గారు..:)