గతవారమంతా ప్రయాణాలతో బిసి బిసిగా ఉన్నాను. ఆష వాళ్ళ పెద్దమ్మ వచ్చే నెల అమెరికా వెళ్తున్నారు. ఆమె అమెరికా వెళ్ళేలోపు శిరిడి సాయిబాబని దర్శించాలంటే నెలకు ముందే ప్లాన్ చేసుకున్నాం. ఆష వాళ్ళ పెద్దమ్మ, మామ, ఇద్దఱు తమ్ముళ్ళు, మేమిద్దఱం - మొత్తం ఆఱుగురం. బెంగుళురు నుండి డైరెక్ట్ శిరిడికి ట్రెయిన్ ఉంది. వారానికి ఒకరోజే. మంగళవారం ఉదయం 7:30కి. మఱునాడు ఉదయం 8:30కి శిరిడి చేరుకుంటుంది. చేరుకున్నాం. రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అఖిల భారత్ సంస్తాన్ ట్రస్టు వాళ్ళు నడిపే భక్తుల విడిదిలో రూం తీసుకున్నాం(ముందే బుక్ చేసుకోవాలి). బహు శుభ్రంగా ఉన్నాయి గదులు. ఆశ్చర్యమేసింది అందఱు వచ్చిపోయేచోట అంత నీట్నెస్ ఎలా మెయింటెయిన్ చేస్తున్నారా అని. ఎప్పుడూ రద్దీగానే ఉంటుందనిపించింది. అయినా అక్కడి సిబ్బంది మాత్రం బంధువులకు తొలిరోజు చూపే ఆత్మీయతను చూపుతూ అతిథి మర్యాదలు చేస్తున్నారు. వాళ్ళ సేవాభావానికి జోహార్లు.
ఆ విడిది భవనం నుండి మందిరం ఒక కిలోమీటర్ కన్నా తక్కువ దూరమే. నడవచ్చు. ఆటోలూ దొరుకుతాయి. మేము ఆటోలో వెళ్ళాము. 10:30కి దర్శనాని వరుసలో నిలుచున్నాము. పెద్ద వరుసే. దర్శన వరుసలో నిలిచే ముందు అక్కడున్న ఒక కాపలా సిబ్బందిని హిందీలో "దర్శనానికి టిక్కెటేమైనా తీసుకోవాలా?" అని అడిగాను. "తెలుగువాళ్ళు టిక్కేట్ తీసుకోనక్కర్లేదు" అని హిందీలో చమత్కరించాడు. నవ్వుకుంటూ, "మనం తెలుగోళ్ళమని ఇతనికెలా తెలిసిందబ్బా?" ఆలోచిస్తూ ఉన్నా కాసేపు. ఆ గుడికి వచ్చే భక్తులను భాషవారిగా లెక్కపెడితే తెలుగువారే ఎక్కువ సంఖ్యలో ఊంటారు. ఒకటిన్నరగంట తర్వాత, మేము సాయిబాబ గర్భగుడి(సమాధి??) చేరుకున్నాం. మేము లోపలికి వెళ్ళేసరికి సమయం 12:00 అయింది. అప్పుడు హారతి సమయమట. అందఱికి ఆనందం హారతి సమయానికి అక్కడికి చేరుకున్నామని. హారతి ఇచ్చే ఆ 45 నిముషాలు అక్కడే కూర్చున్నాము. బాగా కనబడుతుంది సాయిబాబ విగ్రహం. హారతిస్తుంటే అందఱూ భక్తి పారవశ్యంతో భజనచేస్తూ, జపిస్తూ, చప్పట్లుకొడుతూ ఊగిపోతున్నారు. అప్పటివరకు సాయిబాబా అనే పేరుతప్ప ఇంకేమీ తెలియని నాకు ఏం చెయ్యాలో అర్థంకాక అలా కూర్చున్నా.
నాకు సాయిబాబా గురించి ఏమీ తెలియదు. కారణాలు, మా ఇంట్లో వారెవరికీ సాయిబాబా గురించి తెలియకపోవడమో, లేక మా తాతగారి రోజుల్లో సాయిబాబ ఇంత ఫేమస్ కాకపోవడమో, “విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, వైష్ణవమే సర్వంబును ” అనేరీతిలో నా బాల్యంలో మొదటి 10 యేళ్ళలోపే నా బ్రెయిన్ ని ప్రోగ్రాం చేసేయడమో, లేక 10వ యేట చోటుచేసుకున్న దుర్ఘటన ప్రభావంతో నాస్తికత్వానికి దగ్గరకావడమో కూడా కావచ్చు. మానవారాధనకు నా మనసు అంగీకరించకపోవడంకూడా కారణమయ్యుండచ్చు.
హారతి అయిపోగానే ఇంకకాస్త దగ్గఱికివెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనమయి భయటొచ్చేసరికి 1:20 అయింది. మళ్ళీ అఖిల భారత సంస్తాన్ విడిదికి వెళ్ళి భోజనాలకు కూర్చున్నాం. అద్భుతమైనా భోజనం పెట్టారు. ఉచితంగా! అక్కడ విడిది చేసినవారికి మాత్రమే. భోజనాలు చేసి మళ్ళీ మందిరానికి వెళ్ళి ప్రసాదం, విభూతి అవి తీసుకుని వచ్చి సాయంత్రం 6:30 ట్రెయిన్ కి బెంగుళూరు దారిపట్టాం. గురువారం రాత్రి 9:00కి ఇల్లు చేరుకున్నాం. అది మా శిరిడి ప్రయాణ విశేషాలు.
శుక్రవారం సాయంత్రం తమిళనాడులో, వేలూరు దగ్గరున్న బంగారు గుడికి(Golden Temple or Sripuram) వెళ్ళాం. అక్కడి దేవత "శ్రీమహాలక్ష్మి". ఆ విశేషాలు మఱో టపాలో రాస్తాను.

3 కామెంట్లు:
jai sairam..!!:)
మీ షిర్డీ ప్రయాణపు విశేషాలు..బాగున్నాయి. మానవ ఆరాధనకు.. నా మనసు అంగీకరించక పోవడం అన్నారు..చూడండీ..అది నిజం. మనకి చిన్న సహాయం చేస్తేనే.. వారిని దేవుడు..అంటాం..నువ్వు.. సత్య సాయి ని.. దేవుడని అంగీకరించవు ..ఎందుకని అని..నాతో..వాదనకి..దిగిన వాళ్ళు ఉన్నారు. కానీ..నాకు.. భగవంతుండు అంటే.. మన అందరని నడిపించే శక్తి. మనకి నచ్చిన రూపం లో.. ఆరాధించుకోవచ్చు..అంతే కానీ..మనం నమ్మిన దానిని..ఇతరులకు..ఆపాదించే ప్రయత్నం చేయ కూడదు. అని..నా అభి ప్రాయం. అడుగడుగునా గుడి ఉంది..అందరిలో..ధైవముంది..అని..నమ్ముతాను
Jai Sai ram..
అఖిల భారత్ సంస్తాన్ daggara rooms kavalante munduga book cheskovala andi.. appadikappudu vellina rooms dorukutaya?
కామెంట్‌ను పోస్ట్ చేయండి