నిన్న
రాత్రి, 180 అనే తెలుగు సినిమాకెళ్ళాం. ఈ
సినిమాని ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో
తీశారు. ఈ
సినిమా విశేషాలేంటో చూద్దాం.
సిద్ధార్థ్,
నిత్యా మేనన్, ప్రియ ఆనంద్, గీత,
మౌళి, తనికెళ్ళ నటించారు. జయేంద్ర దర్శకత్వం. సభ్యమైన
సినిమా. మొదలైన కొన్ని నిముషాలకే కథ మొత్తం ఊహించేయొచ్చు.
కథ తెలిసిపోయింది ఇక కుతూహలం ఏముంటుంది
అనుకోడానికి లేదు. యువతకు తప్పక
నచ్చే ప్రేమ కథ. యువతకు
నచ్చుతుంది అన్నానని ఇది కుర్రకారు మాత్రమే
చూడతగ్గ సినిమా ఏం కాదు. పెద్దవాళ్ళుకూడా
హాయిగా నవ్వుకోగలరు. సంభాషణల్లో శ్లేషార్థాలూ లేవు, ముఖంమొత్తే దృశ్యాలూ
లేవు. పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు.
సమయం
ఎలా గడిచిందో తెలిసేముందే అర్ధం సినిమా నవ్వుల
మధ్య అయిపోతుంది. రెండో సగంలో కథ
అమెరికాకి వెళ్ళిపోతుంది. ఇంతకన్నా
ఎక్కువగా రాసేందుకు కథలేదు. చిన్న కథని రెండున్నర
గంటలు ఎలా చూపారు? 180 అని
పేరెందుకు పెట్టారు. ఆ 180 కి అర్థం
ఏంటి ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడవలసిందే.
సిద్ధార్థ్ :
కథంతా ఇతని చుట్టూనే తిరుగుతుంది.
ఎప్పట్లాగా బాగనే నటించాడు.
మౌళి :
సంభాషణలను తనగళంతోనే పలికించారు. మంచి హాస్యం ఒలికించారు.
ఒకప్పుడు ఈయన ఎన్నో గొప్ప
హాస్య చిత్రాలను తీశారు. మంచి దర్శకుడు.
గీత :
బాలచందర్ బడిలో నటన నేర్చిన ఈమెకు
ఇదేం కష్టమైన పాత్రకాదు. బాగ చేశారు. ఈమెకూడా
స్వయగళంలోనే సంభాషించారు.
నిత్యా
మేనన్ :
అల్లరి
పిల్ల పాత్రలో అల్లరి చేస్తూ, నవీన దుస్తుల్లో నవ్వుతూ
నటించింది. ఈ
మళయాళపు కుట్టి కొంచం సన్నగా ఉంటే
బాగుండేది. పొట్టివల్లనో ఏమో చీరలో వచ్చే (ఒకేయొక) సన్నివేశంలో అంత బాగా అనిపించలేదు. ఈమెకి
ఇంకా ఇంకా సినిమాలు చెయ్యాలనే ఉద్ధేశం ఉంటే ఒకటి సన్నబడాలి,
లేకుంటే ఇంక కాస్త లావెక్కాలి.
సన్నబడితే తెలుగు సినిమాలు! లావెక్కితే తమిళ సినిమాలు :P
ప్రియ
ఆనంద్ :
హమ్మయ్యా, ఎంత బాగుందో ఈ
అమ్మాయి. అమెరికా అమ్మాయి పాత్రకు బాగా ఇమిడింది. పాత్రకు
కావలసిన భావాలను సహజంగా ప్రదర్శించింది. దుఃఖకర సన్నివేశంలో ఎక్కడ అతి చేస్తుందో
అనుకున్నా, అసలు లేదు. సహజంగా
నటించింది. సినిమా
మొదటి సగంలో నిత్య ని
చూసిన ప్రభావం వల్ల రెండో సగంలో
వచ్చే ప్రియ ఆనంద్ అందంగా,
సన్నగా కనబడుతుందేమో
అని పొరబడేరు. అలాంటిదేమీ లేదు. నిజంగానే ప్రియ
ఆనంద్ సన్నగా బాగుంది. ఇంక
కొంతకాలం మన తెలుగు యువకులకి
ప్రియ జ్వరం ఉంటుంది.
సంగీతం
:
శరత్ సంగీతం అందించారు. మళయాళపు వ్యక్తి కాబట్టో ఏమో పాటల్లో ఎక్కడా
తెలుగుదనం కనబడలేదు. సాహిత్యం తెలుగే అయినా అరవంలాగా వినబడుతుంది.
ఈ సినిమాకు సంగీతం పాటల పరంగా ఒక
ఊనమే (మైనస్ పాయింట్?) అయింది.
నేపద్య
సంగీతం బాగనే ఉంది. ఈ
సినిమా పాటల గురించి రెణ్ణెళ్ళ
క్రితం V B సౌమ్యా గారన్న మాటలు గుర్తు తెచ్చుకుందాం “ఏవిటో,
ఈ సంగీత దర్శకుడి బాధ...
దారి తెలీక వెదుక్కుంటున్నప్పుడు కలిగే అయోమయం
గుర్తొస్తోంది నాకు. ఎంతో గొప్ప
పుణ్యం చేసుకుంటే గానీ, అలాంటి సంగీత
దర్శకుడూ, గాయకుడూ రారు - తెలుగుకు. భావి తరాలకి గొప్ప
ఆదర్శ జీవి ఆ గాయకుడు
మాత్రం.”
కథ, మాటలు, దర్శకత్వము :
పెద్ద
కథేం కాదు. కథ మొత్తం
నాలుగు మాటల్లో చెప్పేయచ్చు. అంత చిన్న కథని
రెండున్నర గంటలసేపు విసుగెత్తించకుండ చూపడంలోనే దర్శకుడి ప్రతిభ తెలిసిపోతుంది. కథనమూ
(స్క్రీంప్లే), తమిళ మాటలూ ప్రముఖ
తమిళ రచయితలు సుబా (స్రేష్ & బాలకృష్ణన్)
గార్ల ది. తెలుగు మాటలు
రాసినది ఉమర్జి అనురాధ, సుబా గార్ల క్లుప్త(crispy)
సంభాషణా శైలీలోనే తెలుగుపదాలు రాశారు! బాగున్నాయ్. చిత్రీకరణలో
బాగా శ్రద్ద తీసుకున్నట్టున్నారు.
చివరి
మాట : సమయం ఉంటే ఒక
సారి చూడచ్చు. తప్పక చూడవలసిన చిత్రమైతే
కాదు.